కాంగ్రెస్ అధిష్టానం పై ఎన్నో అనుమానాలు, మరెన్నో విమర్శలు వస్తూనే ఉన్నాయి. వాటన్నింటికీ సమాధానం చెప్పారు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. పార్టీకి తాను తాత్కాలిక అధ్యక్షురాలుని కాదని పూర్తిస్థాయి అధ్యక్షురాలునేనని స్పష్టం చేశారు. దాంతో పార్టీ నేతలకు ఒక క్లారిటీ వచ్చింది. అంతేకాదు నలుగురి మధ్య మాట్లాడటం కంటే నాలుగు గోడల మధ్య పార్టీ విషయాలపై చర్చించాలని సీనియర్లకు సోనియాగాంధీ చురకలంటించారు. ఇదంతా ఒకేతైతే తాజాగా జరిగిన సిడబ్ల్యుసి సమావేశంలో రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని పంజాబ్, రాజస్థాన్,చతిస్గడ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అధ్యక్ష స్థానంలో రాహుల్ గాంధీ కూర్చోవడంతో పాటు ఆయన ఆధ్వర్యంలో పార్టీని నడిపించాలన్న ఆకాంక్షను వారు వ్యక్తపరచడం విశేషం 2019 ఎన్నికలకు పార్టీ అధినేతగా ఉన్న రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో తాను వచ్చే ఏడాది మొదట్లో పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపడతానని ఆయన స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి సోనియమ్మ తర్వాత వారసుడెవరన్నా దానిపై క్లారిటీ వచ్చేయడమే కాదు పార్టీని రాహుల్ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తున్న సీనియర్లకు సోనియా గాంధీ తాజా సమావేశం తో చెక్ పెట్టారని చెబుతున్నారు.

 అంతేకాదు రానున్న కొద్ది నెలల్లో జరిగే యూపీ, ఉత్తరాఖండ్,గోవా, మణిపూర్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టి అక్కడ విజయం సాధించడం మీద దృష్టి పెట్టాలనే పిలుపును సోనియమ్మ ఇవ్వడం గమనార్హం. మొత్తానికి వదిలేసిన బాధ్యతల్ని తిరిగి తీసుకునేందుకు రాహుల్ సిద్ధం అవడంతో పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ మీటింగ్ పుణ్యమా అని గడిచిన కొన్నేళ్లుగా కొనసాగుతున్న హైడ్రామాకు తెర పడినట్లయింది. కాంగ్రెస్ పార్టీ రథసారథిగా ప్రస్తుతానికి సోనియాగాంధీ ఉన్నప్పటికీ ఆమె తాత్కాలిక అధ్యక్షురాలు మాత్రమేనని, పూర్తిస్థాయి అధ్యక్షుని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని చాలా రోజుల నుంచి వస్తున్న మాట. అయితే దీనికి బలం చేకూర్చేలా జీ 23 పేరుతో సీనియర్లు  ఒక టీం గా ఏర్పడి రాహుల్ కు వ్యతిరేకంగా విమర్శలు చేయడం, ఆయన్ని ఆత్మరక్షణలో  పడేలా చేసింది. ఇప్పుడు రాహుల్ తీసుకున్న నిర్ణయంతో సీనియర్లకు,పార్టీ నేతలకు ఒక క్లారిటీ వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ పార్టీలో చురుకుగా వ్యవహరించనున్నాడనే టాక్ వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: