ఇదే విషయం తాజాగా మరోసారి రుజువైంది. తమిళుల దెబ్బకు ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో దిగి వచ్చింది. బాబోయ్ మమ్మల్ని క్షమించండి అనేస్తోంది. తమిళనాడులో ఉంటే మాత్రం జాతీయ భాష హిందీ రావాల్సిందే అంటూ సంస్థ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓ తమిళ వినియోగదారుడికి జొమాటో ఎగ్జిక్యూటివ్ చెప్పిన సమాధానం... చివరికి ఆ సంస్థ వ్యాపారంపైనే దెబ్బ కొట్టింది. రిజెక్ట్ జొమాటో అంటూ సోషల్ మీడియాలో కస్టమర్ చేసిన పోస్ట్ తెగ ట్రెండ్ అయ్యింది. హిందీ జాతీయ భాష కాదన్న విషయం జొమాటో సంస్థకు తెలియదా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. వికాస్ అనే వినియోగాదారుడు పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అయ్యింది. జొమాటోలో ఆర్డర్ చేయాలంటే హిందీ రావాలా అని ప్రశ్నించారు వికాస్. దీంతో తమిళనాడు వ్యాప్తంగా జొమాటో సంస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఫుడ్ డెలివరీ కంపెనీ కస్టమర్ సర్వీస్ సెంటర్లో ఎగ్జిక్యూటివ్ చేసిన తప్పుకు ఆ సంస్థ క్షమాపణ చెప్పింది.