ఇజ్రాయెల్ తాజా నిర్ణయంతో పాలస్తీనియన్ లు నిరాటంకంగా ఆ దేశాన్ని సందర్శించవచ్చు. గత కొన్నేళ్లుగా ఈ తరహా ప్రక్రియ నిలిచిపోయింది. కానీ ఇప్పుడు దానిపై ఆ దేశం తమ స్పష్టతను వెలిబుచ్చింది. తద్వారా దాదాపు 4000మంది పాలస్తీనియన్ లు ఇజ్రాయిల్ గుర్తింపు కార్డులు పొందనున్నారు. దీనితో వారందరికీ అధికారిక గుర్తింపు లభించినట్టే అయ్యింది. దీనివలన పాలస్తీనియన్లు అనేక విషయాలపట్ల సౌలభ్యం పొందినట్టే. 1967 నుండే పశ్చిమ ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న విషయం తెలిసిందే. ఈ తాజా నిర్ణయంతో ముఖ్యంగా గాజా స్ట్రిప్ మాజీ పౌరులు 2800 మందికి పైగా ప్రయోజనం పొందనున్నారు. వీరందరికి చట్టపరమైన హోదా లభిస్తుంది. అప్పట్లో హమాస్ లో అంతర్గత వివాదాలు నెలకొన్న నేపథ్యంలో వీళ్ళందరూ గాజా స్ట్రిప్ కు చేరుకున్నారు. అప్పటి నుండి పడిగాపులు కాస్తుంటే, ఇప్పటికి వాళ్లకు ఆశ్రయం లభిస్తుంది.

వీరందరికి గుర్తింపు కార్డులు ఇచ్చిన అనంతరం, అక్కడ సైన్యం వారిని పరీక్షించి, వారిని ఆయా ప్రాంతాలకు ప్రయాణానికి అనుమతి ఇవ్వనుంది. ఇజ్రాయెల్ ఆరు రోజుల యుద్ధం తరువాత ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది. అప్పటి నుండి ఇక్కడ నివసించడానికి వచ్చిన ప్రజలు వాళ్లతో గొడవలు పడుతూనే ఉన్నారు. ఈ ప్రాంతం సైనికుల ఆదీనంలో ఉంది, ఇక్కడ ప్రజలు నివసించకూడదు అని చెప్పిన వారు వినకపోవడంతో సైన్యం గట్టిగానే చెప్పాల్సి వచ్చేది. మరోపక్క పాలస్తీనా మానవహక్కు సంఘాలు ఈ విషయంపై ఇజ్రాయెల్ తో విభేదిస్తూ వచ్చారు.

అయితే మొత్తానికి ఇన్నాళ్లకు ఈ గొడవలు సర్దుమణిగి, అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్న 2800మంది గాజా స్ట్రిప్ లకు మేలుజరిగింది. అలాగే నమోదు కానీ వ్యక్తులు 1200ల మందికి కూడా ఈ నిర్ణయం మేలు చేసింది. వీరిలో పశ్చిమ బ్యాంకుకు చెందిన వారి బందువులు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం కింద ఈ నిర్ణయం తీసుకుంది. ఈ గుర్తింపు కార్డుల వ్యవస్థను ఎప్పటికప్పుడు అంటే ప్రతి ఏడాది కూడా పునరుద్దరించాలని ఆ దేశం భావిస్తుంది. గతంలో కూడా ఇలా 32 వేలమందిని ఇజ్రాయెల్ అనుమతించింది. దీనిపై పాలస్తీనా అధారిటీ అధికారి మాట్లాడుతూ, నేడు పౌరసత్వ హక్కులు పొందిన 4000 మంది పేర్లు ప్రకటిస్తారు. వారు తమ పాలస్తీనా గుర్తింపుతోపాటుగా వారి నివాస దేశం చిరునామాను కూడా పొందుతారు. దాదాపు 475000 మంది ఇజ్రాయెల్ యూదులు పశ్చిమ బ్యాంకులో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. వారిని బహిష్కరించడం అంతర్జాతీయ చట్టం ప్రకారం కుదరనిపని. కానీ పాలస్తీనా తో శాంతి చర్చలకు మాత్రం ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలి ఒప్పుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: