తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్ లో జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌ల‌ను అధికార పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. హుజ‌రాబాద్ లో గెలుపే ల‌క్ష్యంగా టీఆర్ ఎస్ నాయ‌కులు అధిష్టానం అడుగు లు వేస్తున్నారు. టీఆర్ ఎస్ ఓట‌మి కి కార‌ణాలు అయిన ప్ర‌తి అంశాన్ని త‌మ కు అను కూలంగా మార్చు కునేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే హుజురాబాద్ లో టీఆర్ ఎస్ కు వ్య‌తిరేకంగా ఉన్నార‌ని తెలుసుకున్న గులాబీ బాస్ ఏకం ప్ర‌తి ఇంటికి ప‌ది ల‌క్ష‌లు ఇచ్చే విధంగా ద‌ళిత బందు అనే ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టాడు. అలాగే ఆ నియోజ‌క వ‌ర్గం లో రైతు బందు, భీమా వంటి అన్ని ప‌థకాల‌ను ప‌కడ్భందీ గా అమ‌లు చేస్తున్నాడు.



అయితే ఈ హుజ‌రాబాద్ ఉప ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అంతే కాకుండా హుజ‌రాబాద్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ విజ‌యం సాధించ కుండా ప్ర‌చారం కూడా నిర్వ‌హిస్తామ‌ని ఫీల్డ్ అసిస్టెంట్లు ప్ర‌క‌టించారు. అయితే  వీరి విష‌యంలో గులాబీ బాస్ ఒక నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. ఫీల్డ్ అసిస్టెంట్ల‌కు న్యాయం చేకురేలా ఈ నిర్ణ‌యం ఉండ బోతుంద‌ని తెలుస్తుంది. అందుకే తాజా గా ఫీల్డ్ అసిస్టెంట్లు హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల నుంచి త‌ప్పు కుంటున్న‌ట్టు నిర్ణ‌యం తీసుకున్నారు. అంతే కాకుండా హుజురాబాద్ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌నివాస్ ను గెలిపించ‌డానికి ప్ర‌చారం కూడా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఫీల్డ్ అసిస‌ట్టెంట్లు తీసుకున్న యూట‌ర్న్ వ‌ల్ల అధికార పార్టీ కి కొంత వ‌ర‌కు ఉప శ‌మ‌నం ల‌భిస్తుంద‌నే చెప్పాలి. ఈ ఎన్నిక‌లు చాలా ర‌స‌వ‌త్తంగా సాగుతున్న స‌మ‌యంలో ప్ర‌తి ఓటు కు కూడా చాలా ప్ర‌ధాన్య‌త సంత‌రించు కుంది. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్ల వ‌ల్ల అధికార పార్టీకి కొంత వ‌ర‌కు అయినా లాభం చేకురే అవ‌కాశం ఉంది.





మరింత సమాచారం తెలుసుకోండి: