నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన అజండా గా తెలంగాణ రాష్ట్రసమితి ఉద్భవించింది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడింది, సాధించుకుంది కూడా. ఈ మూడు సమస్యలపై తమదే పేటెంట్ అని ఆ పార్టి నేతలు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. ఇది నిజం కూడా. గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణ రాష్ట్రం గత కొన్ని సంవత్సరాలుగా సుభిక్షంగా ఉంది.  మ రో మాటలో చెప్పాలంటే యావత్ భారత దేశానికి మరో అన్నపూర్ణ గా తెలంగాణ రాష్ట్రం ఎదిగింది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. తెలంగాణలో ప్రస్తుతం రైతులు  పెద్ద సంఖ్యలో వరి పండిస్తున్నారు.   ఆ రాష్ట్రంలో ఆయకట్టు పెరిగింది. దీంతో వరి సాగు కూడా పెరిగింది.  రైతులు ఆధునిక పద్దతులను అవలంబిస్తుండడంతో దిగుబడులూ పెరిగాయి. దీంతో  రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం నిల్వలున్నాయి. ఇది ఒక విధంగా తెలంగాణ రాష్ట్రం,  అక్కడి ప్రజలు గర్వించ దగ్గ పరిణామం. అయితే, అదే సమయం రైతులకు పరోక్షంగా ఇబ్బంది ఎదురైంది.  రాష్ట్ర ప్రభుత్వం వద్ద ధాన్యం నిల్వలు పెరిగి పోవడంతో కెసిఅర్ ప్రభుత్వం ఈ దఫా రైతులను వరి సాగు చేయవద్దని కోరింది. వరి కన్నా ఇతర రకాల పంటలు మంచి లాభాన్ని చేకూరుస్తాయని రాష్ట్రం ప్రభుత్వం పేర్కోంటోంది. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవాలని ప్రభుత్వం రైతులకు చూచిచింది. ఇది తెలంగాణలో రాజకీయంగా కాక ను రేపింది. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ నిర్మయాన్ని రాష్ట్రం లోని మంత్రులు ప్రజల వద్దకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉత్సాహంతో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలు సహజంగానే  రైతు సమస్యల పై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతే కాదు వరి సాగు చేయాలని రైతులను రెచ్చగొట్టారు. దీంతో  రాష్ట్రంలో రైతు సమస్యలే అజెండాగా  మారింది.  వరి సాగు సమస్య   రాష్ట్రంలో అక్కడ]క్కడా చర్చకు వస్తున్నా... తాజాగా ముఖ్యమంత్రి కెసిఅర్ మీడియా సమావేశంలో కేంద్రప్రభుత్వన్ని ఏకి పారేశారు.వరిలో లావు రకాలను కేంద్ర ప్రభుత్వం కోనడం లేదని విమర్శించారు. రైతులు కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేస్తుంటే ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని ఆరోపించారు. రైతులు వరికి బదులుగా ఇతర రకాలను సాగు చేస్తే మంచి ఆదాయం వస్తుంది కెసిఆర్ తెలిపారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తుంటే భారతీయ జనతా పార్టీ పనిగట్టుకుని విమర్శిస్తున్నదని ఆరోపించారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు.
పనిలో పనిగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖను తనదైన శైలిలో విమర్శించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై  అయితే నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉంది  కాదా మీకు చైతనైతే  రాష్ట్ర రైతులకు సాయం చేయించండి అంటూ  సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మీడియా సమావేశంలో మాట్లాడిన భాష ఎలాంటిది అన్న చర్చను కాస్త పక్కన పెట్టి, ఆయన లేవనెత్తిన సమస్యలను చూద్దాం. ఎక్కడ ఎలా మాట్లాడాలి ? అన్న విషయం ఆయన విజ్ఞతకే వదిలేద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr