నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారం సార్వత్రిక ఎన్నికలను తలపిస్తోంది. ప్రచారానికి ఇంక 48గంటలు మాత్రం గడువు ఉండటంతో జోరు వానలోనూ ప్రచార హోరు తగ్గడం లేదు.  పేరుకు కార్పోరేటర్ ఎన్నికలే అయినా , పోటీలో ఉండేది స్థానికులే అయినా.. వారి గెలుపు కోసం ప్రచారం చేస్తున్న వారు స్థానికేతరులు కావడం గమనార్హం. స్థానికేతరులు ఎంత పెద్ద స్థాయి నేతలయినా.. స్థానికంగా వారికి బలమెంత ? వారు ఓట్లు అడిగితే వేసేవారెందరు అన్న ప్రశ్న  తలెత్తక మానదు.
అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ ఎన్నికలను  మంత్రి అనీల్ కుమార్ యాదవ్ తన భుజస్కందాలపై వేసుకుని , తన రాజకీయ మిత్రుడు, నెల్లూరు రూరల్ ఎం.ఎల్ఏ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డితో కలసి ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికా ర పార్టీ కి చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. నెల్లూరులోనే ఆయన మకాం పెట్టారు.  టిటిడి పాలక మండలి మాజీ అధ్యక్షుడు, తిరుపతి ఎం.ఎల్ఏ  భూమన కరుణాకర్ రెడ్డి  అధికార పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సైతం ఇక్కడ నిర్వహించిన  ఎన్నికల సన్నాహక సభలో పాల్గోని  సోంత పార్టీలోని అసంతృప్తులను చల్లబర్చారు. నగరంలో ని కొన్ని ప్రాంతాలలో  నిర్వహించిన ప్రచారంలో పాల్గోన్నారు.
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలలో తన సత్తా చాటాలని విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది. ఆ పార్టీ తరపున సాక్షాత్తూ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి  అచ్చన్నాయుడు కృషి చేస్తున్నాడు.  ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన  నాటి నుంచి అచ్చన్నాయుడు నెల్లూరు లోనే మకాం పెట్టారు. టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి స్వగ్రాం కూడా నెల్లూరు కార్పోరేషన్ పరిధిలోనికి కావడంతో  టిడిపి కి ఇక్కడి పాగా వేయాలని తలుస్తోంది.  తెలుగుదేశం పార్టీతరపున మాజీ ఉప ముఖ్యమంత్రి  చినరాజప్ప స్థానికంగానే ఉండి తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. మారో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సైతం నెల్లూరు లోనే  ఉండి  తమ పార్టీ ప్రచారానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు.
భారతీయ జనతా పార్టీ తరపున ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాల  ఇన్ చార్జీ సునీల్ దేవధర్ నెల్లూరులో పర్యటించి వెళ్లారు. బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు. శాసన మండలి సభ్యుడు వాకాటి నారాయణ రెడ్డి తదితరులు  ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: