ఒక్కో రంగంలో భారత్ ఆయా దేశాలను దాటుకుంటూ పోతుండటం ఎంతో గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇటీవల భారత్ డిజిటల్ విధాన లావాదేవీలలో మొదటి స్థానంలో ఉందని తేలింది. ఎంతో అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్ ముందుండటం స్వాగతించదగ్గ పరిణామం. ఇప్పటికే ఉత్పత్తి రంగంలో నాలుగో స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం రెండో స్థానానికి ఎగబాకింది. అంటే ఇంకా చైనా కుప్పకూలింది కాబట్టి మొదటి స్థానం లో కి భారత్ వచ్చేసినట్టే అని చెప్పేయవచ్చు. అది అంతర్జాతీయంగా గుర్తింపు పొందటానికి మరికాస్త సమయం పట్టొచ్చు అంతే. ప్రస్తుతం దేశ జనాభాలో 47 శాతం మంది నెట్ వాడుతున్నారు. ఇది ప్రపంచంలోనే ఎక్కువ. 2014 కు ముందు కేవలం ఇది 4.7 శాతంగా మాత్రమే ఉంది. కేవలం ఏడేళ్లలో అతివేగంగా 47 శాతానికి చేరింది.

తాజాగా మరో విషయం ఏమంటే, ఒకప్పుడు బ్యాంకింగ్ అంటేనే అదేదో పెద్దలకు చెందిన విషయంగా చూసేవాళ్ళు. కానీ జన్ ధన్ లాంటి ప్రభుత్వ పధకాల చొరవతో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక బ్యాంకు ఖాతా ఉంది. దానిలో ప్రజలు చిన్న చిన్న మొత్తాలలో అయినప్పటికీ లక్షల కోట్ల మేర నగదు దాచుకుంటున్నారు. ఈ బ్యాంకింగ్ అభివృద్ధి కూడా ప్రస్తుతం జర్మనీ, చైనా లాంటి దేశాల కంటే భారత్ ముందుంది. ఇలా ఒక్కో రంగంలో భారత్ ప్రపంచ స్థాయికి చేరుకోవడం ద్వారా అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేసుకుంటూ పోతుంది.

ఇక్కడే సమస్య మొదలు అవుతుంది, ఒకప్పుడు అమెరికా లాంటి దేశాలకు పక్కదేశాలు అభివృద్ధి చెందుతుంటే అక్కసు ఉండేది, అవన్నీ తనను ఎక్కడ దాటేస్తాయో అని. కానీ ప్రస్తుతం ఆ స్థానంలో చైనా ఉంది. దానికి భారత్ ఎదుగుదల అసలు మింగుడు పడటం లేదు. అందుకే అనేక రకాలుగా భారత్ పై ఒత్తిడి తెచ్చి, ఆర్థికంగా నే కాక అనేక విషయాలలో అణగదొక్కాలని చూస్తుంది. గతంలో కూడా ఇదే తరహాలో భారత్ పై ప్రపంచ స్థాయిలో లేనిపోని ప్రచారాలు చేసి, అది బాగుకుంది. ఇప్పుడు చేసినదానికి అనుభవిస్తుంది. ఇక భారత్ మాత్రం ఎప్పటి లాగానే తనదారిన తాను ప్రయాణం కొనసాగిస్తూనే ఉంది. ఇక అభివృద్ధి ఫలాలు భారత్ వైతే, విషాద ఛాయలు చైనాకు సొంతం. ఇది సత్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: