తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తరువాత దానికి ఇప్పటి వరకు ఇద్దరు నేతలు మాత్రమే అధినాయకత్వ బాధ్యతలు వహించిన విషయం తెలిసిందే. మొదటివారు ఎన్టీఆర్ అయితే రెండవ వారు బాబోరు. పదవి లాక్కున్నారో, దోచుకున్నారో ఎదో ఒకటి మొత్తానికి టీడీపీ కి బాబోరు నాయకుడు అయ్యాడు. అప్పటి నుండి దిగానంటే దిగాను అంటూ ఆ పదవినే పట్టుకు కూర్చున్నాడు. కొన్నిసార్లు గెలిచినా, మరి కొన్ని సార్లు ఓడినా ఆయన శైలిలో స్పందించిన విషయం అందరికి తెలిసిందే. గెలిస్తే అంతా నేను చేసిన అభివృద్ధి అంటాడు, ఓడితే ప్రజలు మోసం చేశారు అంటారు, ఇంతకంటే ఓటమి కి గల కారణాలు విశ్లేషించుకున్న అనుభవం ఆయనకు లేదనే చెప్పాలి. అది అధినేతగా ఆయన రాజకీయ నేపథ్యం. అయినా ఇన్నాళ్లు పార్టీలో ఉన్న సీనియర్ లు కూడా ఆయనను భరించారు. ఇంకా మావల్ల కాదు బాబో అంటూ మొరపెట్టుకున్నప్పటికీ ఈ ఒక్కసారికి అంటూ, మరోసారి పదవి కోసం పాకులాడాడు.

పదవి అయితే దక్కింది కానీ, అధికారం లేకుండానే అది అనుభవించాల్సి వస్తుంది. ఇదంతా ఆయనకు తెలియనిదేమి కాదు, కానీ కొందరికి ఒక పంధా ఉంటుంది, దానిని దాటరు, అలాగే తప్పుకోమంటే వదలరు. అంటే వాళ్ళు అక్కడ ఉన్నంత కాలం ఆ పార్టీ లో ఎదుగుదల కాదు కదా, కనీసం పార్టీకి నామర్దా వచ్చినా మిగిలిన వాళ్ళు అనుభవిచాల్సిందే తప్ప అది ఆయన వలననే అని మాత్రం ఒప్పుకోడు. అలాంటి వాడిని ఇంకా భరించాలా అంటూ సీనియర్ లు ఢీలాపడ్డారనే చెప్పాలి. ఒకవేళ తమకు పదవి లభిస్తుందనే ఆశించి ఉండవచ్చు, కానీ ఆ ఆశ కూడా బాబోరు సీనియర్ లకు లేకుండా చేశాడు. కారణం అధినేతగా వారసుడు ఉండాలని పట్టుదల మరొకవైపు ఉంది. అంటే ఆయనను మించిన వాడిని ఆ పదవిలో పెట్టడానికి తయారవుతున్నారు, అంటే ఇంకాస్త పార్టీ భ్రస్టుపట్టి పోవడం ఖాయం అనే స్వయంగా సీనియర్ నేతలు అనుకోని ఉండటం తప్పేమికాదు.

ఇలా ఉన్న నాయకత్వం తో టీడీపీ ఇన్నాళ్లు నడవడం గొప్ప విషయమే. కేవలం నాటి నాయకుడి ని చూసి మాత్రమే ఇలాంటి నేతలను కార్యకర్తలు మోస్తున్నారు తప్ప, వాళ్లకు కూడా నాయకత్వం పై గౌరవమో ప్రేమాభిమానాలో లేవు. కనీసం అధినేత ఇంట్లో ఉన్న ఆమె(ఎన్టీఆర్ కూతురు) ను చూసి భరించారు తప్ప మరొకటి కాదని స్పష్టం అవుతుంది. ఇక ఒకడు పోయాడు హమ్మయ్య అనుకుందాం అంటుకుంటుండగానే అంతకు మించిన నేతను తమ బుజాలమీదకు ఎక్కిస్తున్న బాబును చూసి నవ్వాలో ఏడవాలో తెలియని స్థితిలో మిగిలిన నేతల పరిస్థితి ఉందని చెప్పకనే తెలిసిపోగలదు. నాయకత్వం సరిలేదనేది టీడీపీకి ఉన్న బలహీనత, కార్యకర్తలు బలమైన ఎన్నాళ్ళు ఈ బరువును మోస్తారు, వాళ్ళు కూడా అలిసిపోలేదు. అదే నేటి ఫలితాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: