క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎప్పటిలా కాకుండా నగిరి ఎంఎల్ఏ రోజా తెలివిగా వ్యవహరించిందనే చెప్పాలి. నియోజకవర్గంలో రోజాకు పార్టీలోనే బలమైన ప్రత్యర్ధివర్గముంది. వీరిని తట్టుకోవటం ఎంఎల్ఏకి ఇబ్బందిగానే ఉంది. ఈ విషయంలో రోజా చాలాసార్లు సంయమనం కోల్పోయి నానా గోల చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఇపుడు మాత్రం కూల్ గా, తెలివిగా వ్యవహరించిందనే అంటున్నారు.




ఇంతకీ విషయం ఏమిటంటే నియోజకవర్గంలో రోజా ఇసుక మాఫియాతో చేతులు కలిపారనే ప్రచారం జరుగుతోంది. ఇసుకను అక్రమంగా తరలించుకుంటు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. దీనికి మద్దతుగా అన్నట్లు కొన్ని వీడియో క్లిప్పుంగులు వాట్సప్, ఫేస్ బుక్ లో వైరల్ అయ్యాయి. మామూలుగా అయితే వాటిని చూసిన రోజా రెచ్చిపోవాలి. కానీ ఎక్కడా ఏమీ మాట్లాడకుండా నేరుగా జిల్లా ఎస్పీని కలిసి వాట్సప్, ఫేస్ బుక్ లో జరుగుతున్న ప్రచారంపై ఫిర్యాదు చేశారు.




ఆ ఫిర్యాదులో ఏముందుంటే పార్టీలోని తన ప్రత్యర్ధివర్గం కావాలనే తనపై బురద చల్లేందుకు అసత్య ప్రచారం చేస్తున్నట్లుంది. తనను టార్గెట్ చేస్తున్న తన ప్రత్యర్ధివర్గం తననే కాకుండా జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైన కూడా బురద చల్లేస్తున్నట్లు కంప్లైంట్ చేశారు. జగనన్న ఇళ్ళపథకంలో పేదల ఇళ్ళ నిర్మాణాలకు ఇసుకను తీసుకెళుతుంటే అదేదో తాను వ్యాపారం చేస్తున్నట్లుగా చిత్రీకరించి ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు.




మామూలుగా రోజా  స్వభావం ప్రకారం ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యర్ధివర్గంపై నానా గోల చేయాలి. కానీ తన స్వభావానికి విరుద్ధంగా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో జగన్+పెద్దిరెడ్డిని కూడా బద్నాం చేస్తున్నట్లు ఫిర్యాదులో చెప్పారు కాబట్టి పోలీసులు కచ్చితంగా దర్యాప్తు చేయాల్సిందే. ఫిర్యాదులో తనపై దుష్ప్రచారం చేస్తున్నవారి పేర్లను కూడా రోజా ప్రస్తావించారట. కాబట్టి పోలీసుల విచారణ ముందు అనుమానితులతోనే మొదలవుతుంది. తాను చేసేపనిని ఇపుడు పోలీసుల ద్వారా చేయించేందుకు ప్లాన్ చేశారన్నమాట. మొత్తానికి రోజా తెలివిగా వ్యవహరించినట్లు అర్ధమవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: