రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి కాస్త పట్టు తక్కువనే విషయం తెలిసిందే. ఏదో అనంతపురం జిల్లా మినహా మిగిలిన జిల్లాపై టీడీపీకి పెద్ద పట్టు లేదు. గత ఎన్నికల్లో అయితే నాలుగు జిల్లాల్లోనూ వైసీపీ హవానే నడిచింది. అయితే ఇప్పుడుప్పుడే సీన్ మారుతూ ఉంది. రెండున్నర ఏళ్లలో వైసీపీపై కాస్త వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అలాగే టీడీపీ పికప్ అవుతుంది. కొన్ని చోట్ల టీడీపీ పరిస్తితి మెరుగైంది. మరి సీమలో ఉన్న సిటీల్లో టీడీపీ పరిస్తితి ఏమన్నా మెరుగైందా? అంటే అంతగా మెరుగైనట్లు కనిపించడం లేదు. సీమలో సిటీ నియోజకవర్గాలు ఐదు ఉన్నాయి. నగర కార్పొరేషన్ల పరిధిలో ఉన్న నియోజకవర్గాలు వచ్చి చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం సీట్లు.

గత ఎన్నికల్లో ఈ ఐదు సీట్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. మరి ఇప్పుడు ఆ సీట్లలో ఏమన్నా పరిస్తితి మారిందా? టీడీపీకి అనుకూమైన పరిస్తితులు వచ్చాయా? అంటే రాలేదనే చెప్పొచ్చు. అసలు చిత్తూరు అసెంబ్లీలో టీడీపీకి సరైన నాయకుడు లేరు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే జె. శ్రీనివాస్ స్ట్రాంగ్‌గానే కనిపిస్తున్నారు. అటు తిరుపతి టౌన్‌లో భూమన కరుణాకర్ రెడ్డి స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. ఇక్కడ టీడీపీ తరుపున సుగుణమ్మ పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఇంకా డిఫరెన్స్ పెరిగినట్లు కనిపిస్తోంది.

అటు అనంతపురం అర్బన్‌లో అనంత వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ వైపు ప్రభాకర్ చౌదరీ ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ ఆధిక్యం అనంతదే. ఇక కర్నూలు టౌన్‌ ఎమ్మెల్యేగా హఫీజ్ ఖాన్ ఉన్నారు. ఈయనకు అంత పాజిటివ్ లేదు. పైగా వైసీపీలో ఆధిపత్య పోరు ఉంది. ఇక్కడ టీడీపీ నేత టీజీ భరత్ కాస్త యాక్టివ్‌గా పనిచేస్తే పైచేయి సాధించవచ్చు. ఇక కడప సిటీ ఎమ్మెల్యేగా అంజాద్ బాషా ఉన్నారు. ఆయనే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక్కడ వైసీపీని డామినేట్ చేయడం కష్టం. మొత్తానికైతే సీమ టౌన్‌ల్లో సైకిల్ నిలబడినట్లు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: