జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాలిటిక్స్‌లో సీరియ‌స్ గా ఉండ‌ర‌ని అనేక సంద‌ర్భాల్లో విమర్శ‌లు ఎదుర‌య్యాయి. కానీ, ఆయ‌న ప్ర‌త్య‌ర్థుల విష‌యంలో చాలా కీలకంగా వ్య‌వ‌హ‌రిస్తారు. జ‌న‌సేన పేరుతో పార్టీ రాజ‌కీయాల్లోకి అడుగుపెడుతూనే 2014లో వైఎస్ జ‌గ‌న్‌ను సీఎం కాకుండా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడ‌నే చెప్పాలి. అయితే, 2019లో ప‌వ‌న్ ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు 2024 వ‌ర‌కు అలాంటి పొర‌పాట్లు చేయ‌మ‌ని జ‌నసేన శ్రేణులు అంటున్నారు. ఇదిలా ఉండ‌గా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఎక్కడి నుంచి పోటీ చేస్తార‌నే చ‌ర్చ మొద‌ల‌యింది. 2019లో విశాఖ సిటీలోని గాజువాక‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు.


   అయితే, ఈసారి కాపులు ఎక్కువ‌గా ఉండే తూర్పు గోదావ‌రి నుంచి ప‌వ‌న్ బ‌రిలో దిగుతార‌ని తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే క‌న్న‌బాబు కాకినాడ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. వీరిద్ధ‌రి మ‌ధ్య ఢీ అంటే ఢీ అనే విధంగా రాజ‌కీయాలు నడుస్తున్నాయి. గ‌తంలో అనేక సార్లు క‌న్న‌బాబు జ‌న‌సేనాని ఎద్దేవా చేశారు. దీంతో పాటు కాకినాడ‌లో రూర‌ల్‌లో కాపుల శాతం బాగానే ఉంది. ఒక‌వేళ పొత్తులు కుదిరితే ఆ సీటును టీడీపీ ప‌వ‌న్‌కు ఇచ్చేందుకు సిద్ధం అని చెబుతున్నార‌ట‌. అన్ని కుదిరితే కాకినాడ సిటీ లేదా కాకినాడ రూర‌ల్ నుంచి ప‌వ‌న్ బ‌రిలోకి దిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే తూర్పు గోదావ‌రిలోని రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై ప్రభావం భారీగానే ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.


   గ‌తంలో రెండు చోట్లా పోటీ చేసినా ఓడిపోవ‌డానికి కార‌ణం కాపులు అధికంగా ఉన్న తూర్పు గోదావరి నుంచి పోటీ చేయ‌క‌పోవ‌డ‌మేనన్న వాద‌న వినిపించింది. ఈ క్ర‌మంలో వ్యూహం మార్చిన ప‌వ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తూర్పు గోదావ‌రి నుంచే ఖ‌చ్చితంగా పోటీ చేస్తార‌ని జ‌న‌సేన శ్రేణులు చెబుతున్నారు. ఇక్క‌డి నుంచి పోటీ చేస్తే ప‌వ‌న్ ఖ‌చ్చితంగా గెలుస్తార‌ని పార్టీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో జ‌న‌సేనాని తూర్పు గోదావ‌రి జిల్లాపై స్పేష‌ల్ ఫోక‌స్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: