గత ఎన్నికల తర్వాత టీడీపీలో మహిళా నేతలు యాక్టివ్‌గా పనిచేయడం తగ్గిపోయిన విషయం తెలిసిందే. పైగా టీడీపీ నుంచి ఒక్క మహిళా నేత మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవాని గెలిచారు. అంతే ఇంకా ఏ మహిళా నేత కూడా విజయం సాధించలేదు. దీంతో టీడీపీలో మహిళా నేతలు పెద్దగా కనిపించలేదు. ఇక తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాత్రమే కాస్త పార్టీలో ఎక్కువ కనిపించేవారు.

దీంతో టీడీపీలో మహిళలకు ప్రాధాన్యత తగ్గిపోయిందనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ టీడీపీలో పలువురు మహిళా నేతలు సైలెంట్‌గా ఉండటం వల్లే ఈ పరిస్తితి వచ్చింది. అయితే ఇప్పుడు వారు దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. పలు నియోజకవర్గాల్లో మహిళా నేతలే బాధ్యతలు చూసుకుంటున్నారు. గత కొంతకాలం నుంచి దూకుడుగా పనిచేస్తున్నారు. పైగా చంద్రబాబు పనిచేసేవారికే సీటు అనడంతో సీన్ మారిపోయింది.

పలు నియోజకవర్గాల్లో ఉన్న మహిళా నేతలు కూడా యాక్టివ్ గా పనిచేయడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో కొందరు మహిళా నేతలు పుంజుకున్నారు కూడా. గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు ఇప్పుడు పికప్ అయ్యారు. అయితే ఇంకొందరు మహిళా నేతలు పికప్ అవ్వాల్సిన అవసరముంది. కొందరు బాగానే పనిచేస్తున్న ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల టీడీపీకి అంతగా ఛాన్స్ దొరకడం లేదు. ఉదాహరణకు ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ స్ట్రాంగ్ నాయకురాలు. కానీ ఆళ్లగడ్డలో వైసీపీ బలంగా ఉంది.

అలాగే పాణ్యంలో గౌరు చరితా రెడ్డి కూడా బలమైన నాయకురాలు. అయితే పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి కూడా స్ట్రాంగ్. ఇటు తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్ట్రాంగ్ గా ఉండటం వల్ల టీడీపీ నాయకురాలు సుగుణమ్మకు అంత ఛాన్స్ దొరకడం లేదు. ఇలా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నాయకురాళ్ళు ఇంకా పికప్ అవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే వారు మళ్ళీ గెలవడానికి ఛాన్స్ దొరకదు.

మరింత సమాచారం తెలుసుకోండి: