సీఎం జగన్ తో ప్రముఖ సినీ కమెడియన్ ఆలీ మంగళవారం రోజు భేటీ చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల సినీ ప్రముఖులతో బేటీ అయినప్పుడు ఆలీ కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా సినీ పరిశ్రమలోని టెక్నీషియన్ల గురించి ఆలీ లేవనెత్తగా మరోసారి మాట్లాడదామని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి జగన్ తో ఆలీ ఒక్కడే భేటీ అయ్యారు. దీంతో ఆలీకి రాజ్యసభ సీటు ఏదైనా కేటాయిస్తున్నారు అన్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మీడియా కథనాలపై అటు ప్రభుత్వ వర్గాలు కానీ, నటుడు ఆలీ కానీ  స్పందించలేదు.

 దీన్ని బట్టి చూస్తే సీఎం జగన్ ఆలిని రాజ్యసభకు పంపేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అయితే ఈ స్థానాలు వైసీపీ ఖాతాలో చేరిపోతున్నాయి. కాబట్టి ఈ నాలుగు స్థానాల్లో ఒక సీటు ముస్లింలకు కేటాయిస్తారని, ఆ సీటు ఖాళీ అయితే కన్ఫర్మ్ అయినట్లు  సమాచారం. ఈ నేపథ్యంలో ఈ వారంలో రెండోసారి సీఎం జగన్ ను ఆలీ కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని మైనార్టీ వర్గానికి  డిప్యూటీ సీఎం మరియు శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్ లాంటి కీలక పదవులు ఇచ్చాడు జగన్. ఒక ఎంపీ పదవి కూడా ఈ వర్గానికి కట్టబెట్టాలని ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆలీ పేరు ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆలీ వైసీపీ పార్టీలో చేరారు. పోయిన ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని భావించినా.. అప్పటికే అన్ని స్థానాల్లో అభ్యర్థులు ఫిక్స్ అయిపోయారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ సూచనతో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే సీటు

 ఇవ్వకపోయినా అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఈ మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అలీ వైసీపీ తరఫున ప్రచారం చేశారు. అయితే కమెడియన్ ఆలీ మాత్రం మంత్రి పదవి ఇస్తే సంతోషిస్తానని చాలా సార్లు మనసులో మాట బయట పెట్టారు. అయితే గత రెండు సంవత్సరాల నుంచి ఆయన పదవి కోసం ఎదురు చూస్తున్నారు. మధ్యలో ఎమ్మెల్సీ పదవి  ఆశించినట్లు ప్రచారం జరిగినా అదేమీ కుదరలేదు. అయితే ఈ సారి మాత్రం రాజ్యసభ సీటు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. కానీ ఈ అంశంపై  వైసీపీ నుంచి అధికారిక ప్రకటన బయటకు వస్తే కానీ నిజానిజాలేమిటో పూర్తిగా తెలియవు.

మరింత సమాచారం తెలుసుకోండి: