ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే.. సమావేశాలు 7న ప్రారంభం అయితే.. మొదటి రోజు గవర్నర్ ప్రసంగంతోనే సభ వాయిదా పడింది. అయితే.. ఇంతలోనే ప్రభుత్వం ఈనెల 9 అసెంబ్లీకి సెలవు ప్రకటించింది. అయితే.. ఈ సెలవు దేని కోసమో తెలుసా.. మంత్రి  బొత్స సత్యనారాయణ పెళ్లి రిసెప్షన్ ఆ రోజు ఉందని.. అందుకే ప్రభుత్వం సెలవు ప్రకటించిందని తెలుగు దేశం నేతలు ఆరోపిస్తున్నారు.


ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో చర్చ జరిగింది. బీఏసీ  సీఎం జగన్ తనపై చేసిన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు చంద్రబాబుకు, ఇతర నేతలకు వివరించారు. ఈనెల 9 వ తేదీన ఎలాంటి కారణం లేకుండా సభకు విరామం ఇవ్వడంపైనా టీడీఎల్పీ భేటీలో చర్చించారు. మంత్రి బొత్స కుమారుని రిసెప్షన్ కోసం 9 వతేదీ సభకు సెలవు ఇచ్చారని.. ఇలా ఇవ్వడం సరికాదని టీడీపీఎల్పీ అభిప్రాయపడింది. వైసీపీ నేతల ఇంట్లో పెళ్లిళ్లకు, పేరంటాలకు సభకు సెలవు ఇస్తారా అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.


మంత్రి ఇంట్లో ఫంక్షన్ కోసం సెలవు ఇవ్వడాన్ని టీడీఎల్పీ తీవ్రంగా ఖండించింది. వైకాపా సర్కారు వింత పోకడలతో సభాగౌరవం తగ్గేలా వ్యవహరిస్తోందని టీడీఎల్పీ భేటీలో నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలపై ప్రభుత్వ దాడిని గవర్నర్ అడ్డుకోలేక పోయారని తెలుగు దేశం నేతలు అంటున్నారు. స్వయంగా గవర్నర్ పేరు తో అప్పులు తెచ్చి.. గవర్నర్ స్థానాన్ని అవమానించింది సీఎం జగనే అని టీడీపీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు.


అలాగే గవర్నర్ ప్రసంగం సమయంలో నిరసన వ్యక్తం చేయడంలోనూ తప్పేమీ లేదని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల సమయంలో ఇలాంటివి ఎన్నోసార్లు జరిగాయని.. అది కేవలం నిరసన తెలపడమేనని వాదిస్తున్నారు. గవర్నర్ పెద్దవాడని గౌరవించాలని జగన్ చెబుతున్నారంటున్న టీడీపీ నేతలు.. మరి చంద్రబాబును ఎందుకు వైసీపీ నేతలు తీవ్రంగా అవమానిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: