రాబోయే విజయదశమి రోజున తిరుపతి నుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాత్ర మొదలుపెట్టబోతున్నారు.  ఇలాంటి యాత్రలు మొదలుపెట్టేవారిలో అత్యధికులు ఇపుడు ఎంచుకుంటున్నది శ్రీకాకుళం జిల్లానే. ఇలాంటిది పవన్ మాత్రం తిరుపతిని ఎందుకు ఎంచుకుంటున్నట్లు ? ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుండే పవన్ పోటీచేయబోతున్నారని ప్రచారం అందరికీ తెలిసిందే.






ఇక్కడనుండి పోటీచేస్తే పవన్ను లక్ష ఓట్ల మెజారిటితో గెలిపిస్తామని పార్టీ నేతలు తీర్మానంచేసి పవన్ కు పంపారు. మరి వీళ్ళ తీర్మానంచూసిన తర్వాత ఇక్కడినుండే పోటీచేయాలని పవన్ డిసైడ్ అయ్యారా అన్నదే అనుమానంగా ఉంది. సరే ఏదేమైనా పవన్ ఇక్కడినుండి పోటీచేస్తారనే అనుకుందాం. మరి లోకల్ నేతలు చెప్పినట్లు లక్ష మెజారిటి వస్తుందా ? అసలు గెలుపు సాధ్యమేనా ? అన్నదే ఆసక్తిగా మారింది. తిరుపతిలో 2.8 లక్షల ఓట్లున్నాయి. ఇందులో 2.4 లక్షలు మాత్రమే పోలయ్యే అవకాశముంది.






ఈ నియోజకవర్గంలోని ఓట్లను చూస్తే బలిజలు(కాపు) అత్యధికంగా 50 వేలదాకా ఉంటారు. తర్వాత బ్రాహ్మణులు, బీసీ, ఎస్సీ, రెడ్డి, ముస్లింలు, ఎస్టీల అండ్ అదర్స్ ఉన్నారు. అంటే 2.40 లక్షల ఓట్లలో బలిజలు నూరుశాతం ఓట్లుపడినా పవన్ గెలుపు గ్యారెంటీలేదు. ఎందుకంటే బలిజలు ఓట్లేసినంతమాత్రాన పవన్ గెలవలేరు. 2.4 లక్షల్లో బలిజల ఓట్లు సుమారు 50 వేలుమాత్రమే మిగిలిన 1.9 లక్షల ఓట్లలో మెజారిటి ఎవరికిపడితే వాళ్ళే గెలుస్తారు. 2019 ఎన్నికల్లో పోటీచేసిన చదలవాడ కృష్ణమూర్తికి వచ్చింది కేవలం 12 వేల ఓట్లే. ఈయన కూడా బలిజ సంఘాల్లో చాలా ప్రముఖంగా ఉంటారు.






అంతకుముందు 2009లో చిరంజీవి పోటీచేసినపుడు వచ్చిన ఓట్లు 56 మాత్రమే. అంటే అప్పట్లో కూడా బలిజల ఓట్లన్నీ పడలేదని అర్ధమైపోతోంది. గడచిన రెండు ఎన్నికల లెక్కలు చూస్తే బలిజల ఓట్లు గంపగుత్తగా చిరంజీవి, చదలవాడకు పడలేదని తెలుస్తోంది. రేపు పవన్ కు కూడా ఇదే పరిస్ధితి. కాబట్టి పవన్ కేవలం బలిజల ఓట్లమీద మాత్రమే ఆధారపడితే మళ్ళీ ఓడిపోవటం ఖాయం. కాబట్టి అందరివాడు అనిపించుకుంటేనే పనవ్ కు జనాలందరు ఓట్లేసే అవకాశముంది. మరి పవన్ అందరివాడనిపించుకుంటున్నాడా ?

మరింత సమాచారం తెలుసుకోండి: