తెలంగాణాలో ప్రస్తుతం రానున్న ఎన్నికల గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఎలాగైనా మళ్ళీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని కేసీఆర్ అనుకుంటుంటే... కేసీఆర్ కు ఇవే చివరి ఎన్నికలు కావాలని మిగిలిన విపక్షాలు కాచుకు కూర్చున్నాయి. మరి ఎవరి పంతం నెగ్గుతుంది అన్నది తెలియడానికి ఇంకా సమయం ఉంది. కేసీఆర్ విజయాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ మరియు వైఎస్సార్ టీపీ లు సకల ప్రయత్నాలు చేస్తున్నాయి. గత రెండు పర్యాయాలుగా తెరాస అధికారంలో ఉంది. అయినా ప్రజలకు ఏమాత్రం మంచి చేశారు అన్నది పక్కన పెడితే ఎమ్మెల్యే మరియు ఎంపీల దౌర్జన్యాలు ఎక్కువ అయినట్లుగా సమాచారం అందుతోంది. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల ప్రజలు వారి పట్ల గుర్రుగా ఉన్నారు.

రాబోయే ఎన్నికల్లో ఈ ప్రజాప్రతినిధులు గెలవడం అసాధ్యమని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అందుకే కేసీఆర్ కు ఈ విషయంలో ఏమి చెయ్యాలి అన్నది పాలుపోవడం లేదట. ఇది తెరాస లో కలకలం రేపుతోంది. కానీ కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈయన సలహా ప్రకారం ప్రజల్లో మంచి పేరు లేని ఎమ్మెల్యే లేదా ఎంపీ లకు సీట్ ఇవ్వకూడదని చెప్పారట. ఇందుకు కేసీఆర్ కూడా సరే అన్నట్లు తెలుస్తోంది, రాబోయే ఎన్నికలకు సంబంధించిన పూర్తి హక్కులు పీకే కి అప్పచెప్పారట.

దీనిని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే లు సీటు కోల్పోతారు. అందుకే ఆ ఎమ్మెల్యేలు అంతా ఒక్కొక్కరుగా కేసీఆర్ ను కలిసి కాకా పట్టేందుకు సిద్ధంగా ఉన్నారట. కొందరు అయితే ఇండిపెండెంట్ గా అయినా నిలబడి గెలవాలని ధీమాతో ఉన్నారట. మొత్తానికి ఎన్నికలకు  ముందే తెరాస ఎమ్మెల్యేలు ఒక అగ్నిపరీక్షను ఎదుర్కోనున్నారు. అయితే ఎమ్మెల్యేలలో ఏర్పడిన ఈ కొత్త వణుకుకు కారణం మాత్రం ముమ్మాటికీ ప్రశాంత్ కిషోర్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: