సంక్షోభంలో కూరుకుపోతున్న మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని  బయటపడేసే బాధ్యతను భర్త నుండి భార్య తీసుకున్నట్లే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం గడచిన పదిరోజులుగా సంక్షోభంలో కూరుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. గంటకో మలుపు తిరుగుతున్న సంక్షోభంలో నుండి ఎలా బయటపడాలో శివసేన చీఫ్, ముఖ్యమంత్రి ఉథ్థవ్ థాక్రేకి అర్ధం కావటంలేదు.





క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు థాక్రేని ముఖ్యమంత్రిగానే ఎవరు గౌరవిస్తున్నట్లు లేదు. అందుకనే ఆయన మాటలను తిరుగుబాటు నేత ఏక్ నాధ్ షిండే కానీ లేదా ఆయన వర్గంలో ఉన్న ఎంఎల్ఏలు కూడా ఏమాత్రం పట్టించుకోవటంలేదు. మరీదశలో ప్రభుత్వం ఎన్నాళ్ళు సంక్షోభంలో కొట్టుకంటుంటుంది ? ఏదోరోజు సంక్షోభానికి తెరపాడాల్సిందే కదా. ఆ తెరపడేదేదో సంకీర్ణప్రభుత్వానికి అనుకూలంగా పడితే బాగుంటుందని థాక్రే భార్య రష్మీ థాక్రే రంగంలోకి దిగినట్లున్నారు.





తిరుగుబాటు శిబిరంలో ఉన్న ఎంఎల్ఏల భార్యలు, కుటుంబసభ్యులను రష్మి కలుస్తున్నారు. వాళ్ళ భర్తలు ముఖ్యమంత్రిపై ఎందుకు తిరుగుబాటు లేవదీశారు ? వాళ్ళకి కావాల్సిందేంటి ? ఎవరి ప్రోదల్బంతో శిబిరంలో కంటిన్యు అవుతున్నారనే విషయాలను మంత్రులు, ఎంఎల్ఏల భార్యలతో చర్చిస్తున్నారు. అన్నీ విషయాలను ఆరాతీస్తున్నారు. భార్యలను లైనులో పెట్టడం ద్వారా భర్తలైన మంత్రులు, ఎంఎల్ఏలను దారిలోకి తెచ్చుకునేందుకు అందుబాటులో ఉన్న అన్నీ మార్గాలను అవలంభిస్తున్నారు.





అప్పట్లో ఎంఎల్ఏలుగా పోటీచేసేందుకు వాళ్ళందరికీ టికెట్ల కేటాయింపులో తానెంత సాయం చేసింది, ఇపుడు తిరుగుబాటు వల్ల లాభపడేదెవరు ? నష్టపోయేదెవరు ? ప్రభుత్వం కూలిపోయినా, రాష్ట్రపతి పాలన వచ్చినా  జరగబోయే పరిణామాలు ఎలాగుంటాయనే విషయాలను భార్యలు, కుటుంబసభ్యుల ద్వారా తిరుగుబాటు మంత్రులు, ఎంఎల్ఏలకు వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలింతకీ రష్మీ థాక్రికి అంత సీనుందా అనే అనుమానాలు అవసరంలేదు. ఎందుకంటే థాక్రే కన్నా భార్య రష్మీయే చాలా తెలివైనది, డేరింగట. బయటకు కనిపించదు కానీ రష్మియే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని బయట టాక్. చూద్దాం తన ప్రయత్నాల్లో రష్మి ఎంత సక్సెస్ అవుతారో.

మరింత సమాచారం తెలుసుకోండి: