తెలుగుదేశంపార్టీలో వర్గపోరుకు తక్కేవేమీలేదు. అందులోను విజయవాడ కేంద్రంగా జరుగుతున్న కంపుకు అంతేలేదు. తాజాగా ఎంపీ కేశినేని వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే తనపేరుతో ఉన్న స్టిక్కర్ ను ఎవరో అజ్ఞాతవ్యక్తి వాడుతున్నారంటు ఎంపీ ఏపీ, తెలంగాణా పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏపీ పోలీసులకు షాకయ్యే వివరాలు తెలిసాయి. అదేమిటంటే ఎంపీ స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్న కారు ఆయన తమ్ముడిదేనట.





ఎంపీకి ఆయన సోదరుడు కేశినేని చిన్నీకి చాలా కాలంగా పడటంలేదు. ఎంపీ టీడీపీతో కూడా అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. చంద్రబాబునాయుడుతో టచ్ లో ఉండటంలేదు. పార్టీనేతల్లో చాలామందితో ఏమాత్రం పడటంలేదు. అందుకనే పార్టీకి చాలా దూరంగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలోనే వచ్చే ఎన్నికల్లో నాని ఎంపీగా పోటీచేస్తారో చేయరో అన్న సందేహాలు మొదలయ్యాయి. పైగా ఈమధ్యనే చంద్రబాబును కలిసినపుడు తాను టీడీపీ ఎంపీని కాదని అందరి వాడినని స్వయంగా నానీయే చెప్పారట.





ఇలాంటి అనేక కారణాలతో ఎంపీకి ప్రత్యామ్నాయాన్ని వెతికారు. ఇందులో బాగంగానే ఎంపీ తమ్ముడు చిన్ని లైనులోకి వచ్చారు. దాంతో చిన్ని పార్టీలో బాగా యాక్టివ్ అయిపోయారు. దీన్ని ఎంపీ సహించలేపోతున్నట్లుంది. దాంతో తమ్ముడితో గొడవలు పడుతున్నారు. ఇపుడు ఫిర్యాదు చేయటంకూడా ఇందులో భాగమే. లేకపోతే తన స్టిక్కర్ అంటించుకుని తిరుగుతున్నది తన తమ్ముడే అని తెలుసుకోలేనంత అమాయకుడు కాదు. తెలిసే ఫిర్యాదు చేశారని అర్ధమైపోతోంది. సరే ఈ ఫిర్యాదు చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.






ఇక్కడ విషయం ఏమిటంటే ఎంపీ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారారు. పార్టీలో ఆయన యాక్టివ్ గా ఉందరు ఇంకోరిని ఉండనివ్వరు. వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తారో లేదో తెలీదు పార్టీ ఇంకోరిని రెడీ చేసుకోవాలనుకుంటే ఒప్పుకోరు. పోనీ చంద్రబాబయినా కేశినేనినీ పక్కనపెట్టేసి ఇంకెవరినైనా పికప్ చేస్తారా అంటే అంత ధైర్యం చేయలేకపోతున్నారు. మొత్తానికి కేశినేని నాని పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. ఇదంతా సరిపోదన్నట్లు ఢిల్లీ టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డితో నాని భేటీ అయ్యారు. మరి దీని ఆంతర్యమేమిటో ?





మరింత సమాచారం తెలుసుకోండి: