ఇటీవలే భారత్ లో 200 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోస్ లు పంపిణీ అయ్యాయని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. భారత జనాభా 140 కోట్లు అయితే అంతకు మించి డోసులు పంపిణీ చేసినట్టు చెప్పుకున్నారు. కానీ భారత్ లో ఇంకా 4 కోట్ల మంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేద. ఇది అధికారిక సమాచారం. పార్లమెంట్ లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పిన మాట. అనధికారికంగా ఇంకా ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. అంటే భారత్ లోనే వ్యాక్సిన్ పుట్టింది, భారత్ నుంచే పంపిణీ అవుతుందని జబ్బలు చరుచుకుంటున్నా.. ఇంకా 4 కోట్ల మంది భారతీయులు కనీసం ఒక్క డోస్ కూడా తీసుకోలేదంటే ఆలోచించాల్సిన విషయమే..?

కరోనా వైరస్‌ ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ పంపిణీ భారత్ లో విస్తృత స్థాయిలో కొనసాగుతున్నా.. ఇంకా 4 కోట్ల మంది ప్రజలు కనీసం ఒక్కడోసు కూడా తీసుకోలేదని తెలుస్తోంది. ఈమేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఇప్పటివరకు భారత్ లో ప్రభుత్వం ఉచితంగా 178,38,52,566 డోసులను అందజేసిందని. ఇది పూర్తిగా పంపిణీ అయిన డోసులలో 97.34శాతం అని చెప్పారాయన. అయితే కరోనా వ్యాక్సిన్‌ ఎంతమంది తీసుకోలేదంటూ పలువురు సభ్యులు లోక్ సభలో ప్రశ్నించారు. దీనికి మంత్రి భారతీ ప్రవీణ్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. 4 కోట్లమంది వ్యాక్సిన్ తీసుకోలేదన్నారు.

దేశ వ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, 60ఏళ్లు దాటిన వృద్ధులకు ప్రికాషనరీ డోసు కూడా ఆల్రడీ మొదలైంది. ఈ ఏడాది మార్చిలోనే ప్రికాషనరీ డోస్ కూడా ఇస్తున్నారు. మరోవైపు 18 నుంచి 59ఏళ్ల వారికి జులై 15 నుంచి ఉచితంగానే ప్రికాషనరీ డోస్ పంపిణీ చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా, ఆజాదీకా అమృత మహోత్సవ్‌ లో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టాలనే ఆలోచనలో కూడా భారత ప్రభుత్వం ఉంది. 75 రోజులపాటు దీన్ని కొనసాగించాలనుకుంటున్నారు. అయితే ఇంకా 4 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకోకపోవడం మాత్రం విశేషమే. అర్హత ఉండి కూడా 4 కోట్లమంది ఎందుకు వ్యాక్సిన్ తీసుకోలేదు, వారికి వ్యాక్సిన్ అందుబాటులో లేదా, లేక వారు వ్యాక్సిన్ తీసుకోడానికి ఇష్టపడటం లేదా అనేది మాత్రం కేంద్రం చెప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: