తెలంగాణా రాజకీయాల్లో ఇపుడిదే చర్చ జరుగుతోంది. నరేంద్రమోడీ సర్కార్ ను దింపేయాలని కేసీయార్ కంకణం కట్టుకున్నారు. ఇదేసమయంలో  కేసీయార్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని మోడీ కూడా డిసైడ్ అయ్యారు. ఇద్దరు కూడా తమ పంతం నెగ్గించుకోవటానికి ఎవరికి వాళ్ళుగా వ్యూహాలు పన్నుతున్నారు.  కేసీయార్ జాతీయస్ధాయిలోని నాన్ ఎన్డీయే పార్టీల మద్దతు కోసం నానా అవస్తలు పడుతున్నారు. ఇదే సమయంలో కేసీయార్ ను ఓడించేందుకు బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది.






ఇక్కడ గమనించాల్సిందేమంటే తమ పంతం నెగ్గేందుకు ఉన్న అవకాశాలు ఇద్దరికీ తక్కువే. ఎలాగంటే ఎన్డీయేని ఓడించటం కేసీయార్ చేతుల్లో లేదు. అలాగే కేసీయార్ తో చేతులు కలపటానికి సానుకూలంగా ఉన్న ప్రతిపక్షాలు కూడా పెద్దగా లేవు. జాతీయ రాజకీయాల్లో కేసీయార్ క్రెడిబులిటి బాగా తక్కువ. అందుకనే నమ్మి కేసీయార్ తో చేతులు కలపటానికి ఎవరు సిద్దంగాలేరు. కాబట్టి మోడీకి వ్యతిరేకంగా కేసీయార్ ఒంటరిపోరాటం చేయలేరు, చేసినా సాధించేదేమీ ఉండదు.





ఇదేసమయంలో తెలంగాణాలో కేసీయార్ ను ఓడించటం అంతసులభంకాదు. ఎందుకంటే కమలనాదులు చెప్పుకుంటున్నంత స్ధాయిలో బీజేపీ అంతబలంగా ఏమీలేదు. చాలా నియోజకవర్గాల్లో పోటీచేయటానికి పార్టీకి గట్టి అభ్యర్ధులు లేరన్నది వాస్తవం. సొంతంగా అబ్యర్ధులు లేరుకాబట్టే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో గట్టి నేతలు అనుకున్నవారికి గాలమేస్తోంది. ఎవరో కొంతమంది పై రెండుపార్టీల నుండి చేరారే కానీ ఎక్కువమంది చేరలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ చేరికలు ఎక్కువుంటాయని ఆశిస్తున్నారు.






రెండుపార్టీల నుండి చేరికలు లేకపోతే పార్టీకి ఎన్నికల్లో  ఆశాభంగం తప్పదు. అమిత్ షా ప్రతినెల రెండురోజులు కాదు వారంరోజులు తెలంగాణాలో పర్యటించినా ఎంతమాత్రం ఉపయోగముండదు. పార్టీకి క్షేత్రస్ధాయిలో బలంలేకపోతే పై స్ధాయిలో ఉండిమాత్రం ఏమిటి ఉపయోగం ? ఎలక్షనీరింగ్ ను సమర్ధవంతంగా నిర్వహించగలిగిన నేతలు బీజేపీకి చాలాచోట్ల లేరు. కాబట్టి ఇద్దరి పంతం నెరవేరేందుకు అవకాశాలు చాలా చాలా తక్కువనే అనిపిస్తోంది. తెలంగాణాలో కానీ కేంద్రంలో కాని షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఎప్పుడేం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: