జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కు మతిపోయినట్లుంది. రాజదాని గురించి మాట్లాడుతు ‘దమ్ముంటే రాజధాని అంశంమీద ఎన్నికలకు వెళదాం రండి’ అంటు జగన్మోహన్ రెడ్డిని చాలెంజ్ చేయటమే విచిత్రంగా ఉంది. మూడు రాజధానులే ప్రధాన అజెండాగా తాము వచ్చేఎన్నికల్లో పోటీచేస్తామని ఇప్పటికే జగన్ ప్రకటించారు. జగన్ చేసిన ప్రకటన కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు మంత్రులు పదేపదే చెబుతున్నారు. మరి కొత్తగా నాదెండ్ల రాజధాని అంశంగా ఎన్నికలకు వెళదామని చాలెంజ్ చేయటంలో అర్ధమేంటి ?

విశాఖపట్నమే రాజధాని అనే విషయంలో జగన్ కో స్పష్టంగానే ఉన్నారు. బయటకు చెప్పుకోలేకపోతున్నది చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ మాత్రమే. విశాఖే రాజధాని అని జగన్ చెబుతున్నట్లుగా అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చంద్రబాబు, పవన్ ఇంతవరకు ఒక్కసారి కూడా చెప్పలేదు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలనే డిమాండుతో వచ్చే ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు చంద్రబాబు,  పవన్ ఎందుకు చెప్పలేకపోతున్నారు ?

రాజధాని విషయంలో క్లారిటిగా ఉన్నదెవరు ? క్లారిటి లేనిదెవరికి ? ఇక్కడ విషయం ఏమిటంటే జగన్ కు వ్యతిరేకంగా, వైసీపీ ప్రభుత్వంపై ఎవరు బురదచల్లినా, ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయినా ప్రముఖంగా అచ్చేయటానికి ఎల్లోమీడియా రెడీగా కాచుక్కూర్చునుంటుంది. అందుకనే నాదెండ్ల లాంటివాళ్ళు కూడా పెద్ద పెద్ద నేతలుగా చెలామణి అయిపోతున్నారు.

రాజధాని విషయంలో జగన్ను చాలెంజ్ చేయటం కాదు తమ అధినేత పవన్ తో ప్రకటన ఇప్పిస్తే బాగుంటుంది. మాటమాటికి పవన్ విశాఖలో పర్యటిస్తుంటారు కదా. మరి ఈసారి విశాఖ పర్యటన సందర్భంగా  అమరావతే రాజధాని అని పవన్ తో  నాదెండ్ల  ప్రకటన చేయించగలరా ? అలాగే పొత్తు పెట్టుకుందామని ప్రయత్నాలు జరుగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా ఇదే విధమైన ప్రకటన చేయిస్తే బాగుంటుంది. ఒకసారంటు అధికారికంగా క్లారిటితో చంద్రబాబు, పవన్ రాజధాని విషయంలో తమ స్టాండ్ ఏమిటో ప్రకటించేస్తే అప్పుడు ఎవరి ధైర్యం ఏమిటో, ఎవరి వ్యవహారం ఏమిటో తేలిపోతుంది.


 


మరింత సమాచారం తెలుసుకోండి: