బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు తీర్పు వెల్లడించనున్నది. 1992 డిసెంబర్ 6న కరసేవకులు అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేశారు. దీనిపై నమోదైన కేసు 28 ఏండ్లపాటు విచారణ కొనసాగింది. ఈ కేసులో బీజేపీ వ్యవస్థాపకులు ఎల్కే అద్వానీ, మురళీమనోహర్జోషి, పార్టీ సీనియర్ నేతలు ఉమా భారతి, వినయ్ కతియార్, సాధ్వి రితంబర, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్ సహ మొత్తం 49 మందిని సీబీఐ నిందితులుగా చేర్చింది.