ఇప్పుడు తాజాగా ఏపీ బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి కరోనా బారిన పడ్డారు. ఆమెకు అనారోగ్యంగా ఉండడంతో టెస్టులు చేయించుకోగా... కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో హైద్రాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇటీవలే ఆమెను జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీజేపీ అధిష్టానం ప్రకటించింది.