వైఎస్ వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారికి కరోనా సోకింది. దీంతో కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన సీబీఐ అధికారి వ్యక్తిగత ఐసోలేషన్‌కు వెళ్లారు. దీనితో మిగతా అధికారులకు కూడా కోవిడ్ భయం పట్టుకుంది. ఈ బృందంలో మిగతా వారికి కూడా కరోనా పాజిటివ్ గా తేలితే వివేకా హత్య కేసు విచారణ మరో సారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.