హరీష్ రావు ఆగ్రహం అంతా బీజేపీనే కనిపిస్తోంది. ఆ పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో చేస్తున్న ప్రచారం కాదు… సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంపైనే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచారం రేంజ్ ఎలా ఉందంటే.. చివరికి ఆయన సవాళ్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని దమ్ముంటే తన వద్దకు వచ్చి నిరూపించాలని అంటున్నారు. తాను దుబ్బాకలోనే ఉన్నానని ప్లేస్ చెబుతున్నారు. దీనంతటికి కారణం… బీజేపీ సోషల్ మీడియా.. ఆయనపై వ్యక్తిగత రూమర్స్ ప్రచారం చేయడం లేదు. టీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాల్లో… కేంద్ర నిధులు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు.