ఇటీవల కైమూర్ ప్రాంతంలో పోలీసులు తప్పుడు కేసులు మోపి 25మంది కైమూర్ ముక్తి మోర్చా కార్యకర్తలను అరెస్ట్ చేసిన కారణంగా, పోలీసులను ఉపయోగించి అటవీశాఖ బలవంతంగా దాడులు చేయిస్తున్న నేపథ్యంలో గిరిజన గ్రామాల ప్రజలు సంచలన నిర్ణయం తీసుకొని అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని తమ భావాన్ని వ్యక్తం చేశారు. కైమూర్ ప్రాంతంలోని అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించడాన్ని అక్కడి గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకించారు...