ఈరోజుల్లో దేశంలోని మీడియా మరియు సోషల్ మీడియా యొక్క విశ్వసనీయతపై సందేహాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వారి మాటలకు లోబడి కొన్ని జాతీయ వార్తా సంస్థలు మరియు సోషల్ మీడియా వర్గాలు వ్యవహరిస్తున్నారు. వీరిని పొగిడే కార్యక్రమాన్ని ప్రధాన అజెండాగా పెట్టుకుని దేశంలో ఉన్న అనేక ప్రధాన సమస్యలను అణగదొక్కుతున్న తీరును మనం అనేక సందర్భాల్లో చూసి ఉంటాము.