మన్ కి బాత్ కార్యక్రమంలో నిన్న మోదీ ప్రత్యేకించి ఖద్దరు బట్టలను ఆకాశానికి ఎత్తేసిన విషయం అందర్నీ ఆశ్చర్యపరిచింది..... అసలు ఖద్దరు వస్త్రాలు గురించి మాట్లాడాల్సిన సందర్భం లేని సమయంలో మోడీ ఇలా ఖాదీ బట్టలు గురించి మాట్లాడటం వెనుక ఆయన ఆసక్తి ఏమిటో తెలియలేదు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతున్న సమయంలో ఖద్దర్ వస్త్రాల ప్రస్తావన తెచ్చి దేశంలో ఖాదీ బట్టలకు డిమాండ్ పెరుగుతున్నట్లు అందరికీ తెలియజేశారు.