ఇసుకను ఆన్లైన్ బుకింగ్ చేసుకునే విధానం వచ్చాక .. .రాష్ట్రంలో అందరికీ ఆన్లైన్ సదుపాయం అందుబాటులో లేకపోవడం, ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకునే విధానాన్ని కొందరు అక్రమమార్గంలో వినియోగిస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దాంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ఇసుక బుకింగ్స్‌లో సాఫ్ట్‌వేర్‌ని హ్యాక్ చేస్తున్న కొందరిని గుర్తించింది. వారిపై కేసులు కూడా నమోదు చేసింది.