చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల ఓటమి ఇంకా పీడకలాగానే ఉందని చెప్పొచ్చు.. గెలుస్తామని ధీమా గ ఉన్న బాబు కు ఇది ఒకరకముగా పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఇకప్రజలు ఈ ఎన్నికల్లో అంత దారుణంగా ఓడించినా కూడా ఆయనకు కొంతైనా బాధ్యత లేకుండా వ్యవహరించడం అందరిని ఆశ్చర్యం కలిగిస్తుంది.. ప్రజల తీర్పును ఆయన గౌరవించకుండా అధికారంలోకి వచ్చిన జగన్ ను ఎప్పుడూ విమర్శిస్తూ ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుందా అని ఎదురుచూస్తున్నాడు.. ఇప్పటికే పడిపోయిన పార్టీ ని చక్కదిద్దుకోవాల్సింది పోయి వయసు, అనుభవం, సీనియారిటీ అన్ని ఉంది కూడా ఇలా చేస్తుండడం ప్రజలకు ఏమాత్రం నచ్చడం లేదు..అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోవడం మానేసి , ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ప్రజల కోసం ప్రజల పట్ల మొసలి కన్నీళ్లు కార్చడం ఒక్క టీడీపీ కే చెల్లింది..