ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటినుంచో పోలవరం గురించి చర్చ జరుగుతుంది.. ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం మాత్రం కొంచెం కూడా కదలట్లేదు.. ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్ట్ నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వాలు దాటవేస్తూ వస్తున్నాయి.. రాష్ట్రాన్ని విడగొట్టి ఇప్పటికే అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో, స్పెషల్ ప్యాకేజ్ విషయంలోనే కాకుండా పోలవరం విషయంలో కూడా రాష్ట్రనికి చాలా అన్యాయం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అయినా పట్టించుకుంటుందా అంటే గత ప్రభుత్వాలే నయం అన్నట్లు ఆ పార్టీ వ్యవహరిస్తోంది.