రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ ముమ్మాటికీ జగన్ మొహం చూసే ఇంతటి విజయాన్ని అందుకుంది చెప్పొచ్చు.. వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి అభ్యర్థుల పేరు, ప్రతిష్టలకన్నా ఎక్కువ జగన్ ఇమేజ్ తోడయ్యింది అన్న వాదన ను ఎవరు కాదనలేం. ఎందుకంటే జగన్ మొహం చూసే నియోజకవర్గంలో ఎవరో నిలబడ్డారో కూడా తెలీని ప్రజలు వైసీపీ కి ఓటువేశారు.. ఆ నమ్మకాన్ని వందకు వంద శాతం నిలబెడుతున్న జగన్ ఆ క్రెడిట్ తానొక్కడినే తీసుకోకుండా అభ్యర్థులందరికీ, కార్యకర్తలందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.. సంక్షేమ పథకాల్లో తానున్న లేకపోయినా అక్కడి ఎమ్మెల్యేలతో చేయిస్తూ ప్రజలకు మేలు జరగడమే లక్ష్యం గా ముందుకు సాగిపోతున్నారు..