2020 గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికలు మొత్తానికి సమాప్తం అయ్యాయి. ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఎంత హడావిడి చేశాయో తెలిసిందే... పార్టీ నేతలు ప్రతిపక్షాలపై విమర్శలు వెదజల్లుతూ... ఘాటు వ్యాఖ్యలు చేస్తూ... పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అభివృద్ధి అజెండా లతో ప్రజలను ఆకర్షించేందుకు ప్రణాళికలను రచించారు.... ముఖ్యంగా అధికార పార్టీ మరియు బిజెపిల మధ్య జరిగిన మాటల యుద్ధం అంతా ఇంతా కాదు... ఇదిలా ఉండగా ఎలక్షన్ కోసం అంత చేసినా నాయకులకు షాక్ ఇచ్చారు ఓటర్లు.