చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ గత ఏడాది ఇదే సమయంలో ఎంత విజృంభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా వైరస్ కేసులు తక్కువ సంఖ్యలో ఉన్న సమయంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహమ్మారి వైరస్ ను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాయి. దీంతో దేశం మొత్తం ఎక్కడికక్కడ ఒక్కసారిగా ఆగిపోయింది. అంతా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా మారిపోయింది. అయితే అకస్మాత్తుగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో వలస కూలీల ఎన్ని అవస్థలు పడ్డారో అందరూ కళ్లారా చూసారూ. కొన్ని కొన్ని సార్లు వలస కూ