పవన్ కల్యాణ్...బిజేపికి దూరం అవుతున్నారా? త్వరలోనే వీరి పొత్తుకు బ్రేకులు పడనున్నాయా? అంటే అవుననే రాజకీయ విశ్లేషకుల నుంచి సమాధానం వస్తుంది. ఎందుకంటే గత కొంతకాలం నుంచి బిజేపి, జనసేనల మధ్య అనుకున్న మేర సత్సబంధాలు ఉన్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా తెలంగాణ బిజేపి నాయకులతో పవన్‌కు అసలు సఖ్యత ఉన్నట్లు లేదు.