ప్రస్తుతం "సూర్యకాంతం" సినిమా ప్రమోషన్ లో బిజీ గా ఉన్న నాగబాబు కూతురు నీహారిక కొణిదెల ఒక ఇంటర్వ్యూలో జనసేన  అధ్యక్షుడు, ఆమె బాబాయి అయిన పవన్ కళ్యాణ్ గురించి కొన్ని మంచి విషయాలు పంచుకున్నారు.

కళ్యాణ్ గారికి ఈ రాజకీయ ఆరంగేట్రం ఆలోచన ఎప్పుడు మొదలైందో తనకు తెలియకపోయినా ఇప్పుడు అతను చేస్తుంది చాలా గొప్ప విషయం అని ఆమె కొనియాడారు. కేవలం ప్రజలకోసమే ఆయన పార్టీ పెట్టినట్లు, మిగతా వారికి, ఆయనకు చాలా తేడా ఉందని ఆమె అన్నారు. ఇంట్లో ఒక్కసారిగా ఈ పొలిటికల్ వాతావరణం అలవరచుకునేందుకు తనకు కొంచెం సమయం పడుతుంది అని, అయితే తన తండ్రి నాగబాబు గారు ఒక్కసారిగా రాజకీయాల లోకి వెళ్ళడం తనని ఆశ్చర్యపరిచింది అని ఆమె అన్నారు.

ఆమె కూడా బాబాయి ఒక్క మాట చెప్తే ప్రచారానికి సై అని ఆమె అన్నారు. అయితే పవన్ కు అంత అవసరం ఉండదు అని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే వాళ్ళ నాన్నకు ఆమె ఫోన్ చేసి రాజకీయ నాయకులలాగా మాట్లాడొద్దని, తన సొంత గంభీరమైన గొంతుతోనే ప్రసంగించమని కోరినట్లు ఆమె తెలిపారు. కానీ పవన్ కు పూర్తిగా సపోర్టు చేయమని, అతను ఎలాగైనా ప్రజల పక్షాన విజయం సాధించాలని ఆమె కోరుకుంటున్నట్లు కూడా అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: