కొత్త ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం జగన్ ఫుల్ గా క్లాసు తీసుకున్నారు. వైసీపీ నుంచి ఎన్నికైన 153 ఎమ్మెల్యేల్లో 70 మందికి పైగా కొత్తవారే కావడంతో వారికి తన అనుభవాలు జోడించి సలహాలు, సూచనలు ఇచ్చారు. అసెంబ్లీకి నామ్ కే వాస్తే గా రావద్దని ఫుల్ గా ప్రిపేరయ్యే రావాలని సూచించారు.


ఆయన ఇంకా ఏమన్నారంటే..

అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ప్రిపేర్ అయ్యే మాట్లాడండి.. ఏది పడితే అది మాట్లాడితే దొరికిపోతాం.. మనం ప్రిపేర్ కాకుండా అప్పటికప్పుడు మాట్లాడితే..ఎదుటి పక్షం వారు లేచి.. ఏదో డాక్యుమెంట్ సాక్ష్యంగా చూపించి తెలుసుకుని మాట్లాడు అంటూ విమర్శిస్తారు.


అప్పుడు మనం ఇబ్బందుల్లో పడతాం.. మీకు ఈ విషయంలో సమాచారం ఇచ్చేందుకు, ప్రిపేర్ చేసేందుకు శ్రీకాంత్, రాజా అండగా ఉంటారు. మీకు కావలసిన మెటీరియల్ ఇస్తారు. కానీ ముందు మీకు ఆ తపన ఉండాలి.


అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యే అటెండెన్స్ మస్ట్ గా ఉండాలి.. మనం ఎన్నికల్లో హోరాహోరీ పోరాడి గెలిచిందే అసెంబ్లీకి వచ్చేందుకు కదా.. ఏదో నిరసన కోసమో.. డుమ్మా కొడితే ఓకే.. కానీ కారణం లేకుండా డుమ్మా కొట్టొద్దు.. అంటూ జగన్ కొత్త ఎమ్మెల్యేలకు క్లాసు పీకారు.


మరింత సమాచారం తెలుసుకోండి: