అదేంటి జగన్ తో కేసీఆర్ కు లింకేటి..? జగన్ ఎలాంటి స్టెప్ తీసుకుంటే మాత్రం అది కేసీఆర్ కు ఎలా ఎఫెక్టవుతుంది.. అనుకుంటున్నారా.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయినా కొన్ని సమస్యలు మాత్రం ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి. ఉదాహరణకు ఆర్టీసీ.. తెలంగాణ విడిపోయాక.. రెండు ఆర్టీసీలు వేరయ్యాయి. రెండు చోట్లా ఆర్టీసీలు నష్టాల్లోనే ఉన్నాయి.


కానీ ఇప్పుడు జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేందుకు రెడీ అయ్యారు. ఇందుకు సంబంధించిన అధ్యయన కమిటీ సీఎం జగన్ కు నివేదిక సమర్పించింది. బుధవారం కేబినెట్ మీటింగ్ లో దీనిపై చర్చించి ఆమోదం తెలపబోతున్నారు. అదే జరిగితే.. ఆర్టీసీ కార్మికుల చిరకాల వాంఛ నెరవేరినట్టే.. వారి ఇళ్లలో దేవుడి ఫోటో పక్కన జగన్ ఫోటో ఖాయం.


ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని క్లారిటీగా చెప్పేశారు. సుదీర్ఘకాలంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల కల నెరవేరబోతుంది. ప్రతి సంవత్సరం ఆర్టీసీ మీద ఉన్న జీతభత్యాల భారం సుమారు రూ. 3,300 నుంచి రూ. 3,500 కోట్లు ఉంటోంది. ఇప్పుడు ఆ భారాన్ని వైయస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకోబోతుంది.


తాజాగా జగన్ నిర్ణయంతో కేసీఆర్ డైలమాలో పడ్డారు. ఇక్కడ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్లు ఆటోమేటిగ్గా వస్తున్నాయి. ఏపీలో విలీనం చేసి తెలంగాణలో చేయకపోతే.. దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఉన్న ఆర్టీసీ కార్మికులు నెగిటివ్ అవుతారు. అది సర్కారుకు మంచిది కాదు. పోనీ విలీనం చేద్దామంటే ఏటా కోట్ల రూపాయల నష్టం భరించాల్సి వస్తుంది. మరి అందుకు జగన్ సిద్ధపడ్డాడు.. కేసీఆర్ ఏం చేస్తారో.. అప్పుల్లో ఉన్న రాష్ట్రమే చేస్తుంటే.. ధనిక రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాణ చేయకపోతే..అది కూడా కేసీఆర్ కు చెడ్డపేరే తెస్తుంది. అందుకే జగన్ కొట్టిన ఆర్టీసీ దెబ్బతో కేసీఆర్ ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. మరి ఏం చేస్తారో.. ?


మరింత సమాచారం తెలుసుకోండి: