టీడీపీ హయాంలో జరిగిన అనేక అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఎంక్వయిరీ చేయిస్తున్నారు. ఏ అంశాన్నీ వదిలిపెట్టడం లేదు. పోలవరం నామినేషన్లు, రాజధాని ప్రాజెక్టులు.. ఇలా ప్రతి విషయంలోనూ టీడీపీ అవినీతిని నిరూపించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే జగన్ ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్లే ఇప్పుడు టీడీపీ రాజధాని విషయాన్ని ప్రముఖంగా పైకి తెస్తోందని వైసీపీ అనుమానిస్తోంది.


తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశంలో ఇదే అనుమానం వ్యక్తం చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలన ప్రజలంతా మెచ్చారు. అది చూసి ఓర్వలేక తెలుగుదేశం ఆడే డ్రామాలు అనేకం చూస్తున్నాం. పెయిడ్‌ ఆర్టిస్టుతో టీడీపీ చేయిస్తున్న నాటకాలు ప్రజలంతా చూస్తున్నారు. అత్యంత గౌరవప్రదమైన స్పీకర్‌ స్థానాన్ని కోడెల శివప్రసాద్‌ దిగజార్చారు.


అసెంబ్లీలోని ఫర్నిచర్‌ దాచుకున్న విషయం బయటకు వచ్చింది. ఆ విషయాలపై ఎక్కడ చర్చజరుగుతుందోనని భయపడి రాజధాని మార్చుతున్నారని టీడీపీ నేతలు టాపిక్‌ డైవర్ట్‌ చేస్తున్నారుని శ్రీకాంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు లక్షల కోట్లు దోచుకున్నారని ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ప్రతిపక్షం అడ్డుపడుతోందని ఆయన మండిపడ్డారు.


ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికి ఆదర్శంగా మారుతున్నారని.. అవినీతికి ఆమడదూరంలో ఉండాలని ప్రతి మీటింగ్‌లో మాట్లాడడమే కాకుండా, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి అధికారులతో జరిగే ప్రతి రివ్యూ, ప్రతి మీటింగ్‌లో అవినీతి రహిత పాలన అందించాలని సూచిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు.ప్రభుత్వ సొమ్ముకు కాపలాదారుడిగా ఉండాలని, ఏ ఒక్క రూపాయి అవినీతి కాకూడదని రివర్స్‌టెండరింగ్‌ చట్టాన్ని తీసుకువచ్చారని శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు ఈ విచారణలతో తమ పరువు ఎక్కడ పోతుందో అన్న భయం టీడీపీ నేతలకు పట్టుకుందని.. అందుకే.. టాపిక్ డైవర్ట్ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారని ఆయన ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: