అర్జున్ రెడ్డి సినిమా గుర్తుందిగా .. అందులో హీరో హీరోయిన్లు ఇద్దరూ వైద్య విద్యార్థులే. ప్రేమలో పడతారు.. కానీ కులాలు వేరు.. హీరోయిన్ తల్లిదండ్రులు ఒప్పుకోరు.. ప్రీతిని వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు.. దాంతో హీరో విజయ్ పిచ్చివాడిగా మారిపోతాడు.. ప్రీతిని మర్చిపోలేక నరకం అనుభవిస్తాడు.. ప్రీతని మరిచిపోయేందుకు ఎన్నో పిచ్చి పనులు చేస్తాడు.. కానీ సినిమా కదా.. చివరకు హీరో హీరోయిన్లు ఒక్కటవుతారు..


కానీ అన్ని అర్జున్ రెడ్డి సినిమాలా సుఖాంతం.. కావు.. అందులోనూ కులపిచ్చి అధికంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో కులాంతర ప్రేమ కథలు సులభంగా సుఖాంతం కావు.. అందుకు ఉదాహరణే ఈ తాజా అర్జున్ రెడ్డి లాంటి కథ. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన ఓ వైద్య విద్యార్థి శరత్ చంద్ర కుమార్ ప్రేమకు పెద్దలు కులాల పేరుతో అడ్డుచెప్పడంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.


కేరళలో డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ చేస్తున్న పుంగనూరు వైద్య విద్యార్థి శరత్ చంద్రకుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయన జులైలోనే విషం తాగిన అతడు... రెండు నెలలు ఆసుపత్రిలో చికిత్సపొందినా ఫలితం లేకపోయింది. శరత్ చంద్రకుమార్ ది కూడా సేమ్ అర్జున్ రెడ్డి తరహా స్టోరీయే.. ఎంబీబీఎస్‌ చదివే సమయంలో తోటి వైద్య విద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. అతని ప్రేమకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.


కాబోయే డాక్టర్లు ఇద్దరూ ఇష్టపడినా కులాల కారణంగా అమ్మాయి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారు. వారిని ఒప్పించేందుకు శరత్ చంద్ర ఎంతో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇక ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదని తేలిపోయిన శరత్ చంద్ర జులై 10న విషం తాగాడు. శరత్ చంద్ర తల్లిదండ్రులు అతడిని వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చేర్పించారు. మృత్యువుతో పోరాడి చివరకు ప్రేమలో ఓడినట్టే మృత్యువు చేతిలోనూ శరత్ చంద్ర కుమార్ ఓడిపోయాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: