ఈ నెల 22న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సన్నద్ధం అయిపోయాయి. మున్సిపల్ పోరులో తమదే విజయమని అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నయి  అన్ని పార్టీలు. ఇక టిఆర్ఎస్ పార్టీ మరోసారి విజయ దుందుభి మోగించినుంది అని  ప్రజలు కూడా అనుకుంటున్నారు. కారణం టిఆర్ఎస్ పార్టీకి సరైన ప్రతిపక్షం కూడా లేకపోవడం. ఏ పార్టీ కూడా టిఆర్ఎస్ పార్టీకి పోటీలు వచ్చేలా కనిపించడం లేదు అని ప్రజలు అనుకుంటున్నారు.అటు తెరాస  కూడా తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతుంది . ఇకపోతే తాజాగా మీడియాతో మాట్లాడిన టిఆర్ఎస్ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

 

 మ్యానిఫెస్టోలో  ప్రకటించిన అన్ని  హామీలను టిఆర్ఎస్ సర్కార్ దాదాపు అమలు చేస్తుందని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని పట్టణాలు  మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలందరూ గమనిస్తున్నారు అని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలన కు నచ్చి రాష్ట్రంలోని మహిళలు అందరూ తమ ఇళ్ల ముందు సంక్రాంతికి కారు  ముగ్గులు వేసుకుంటున్నారు అంటూ వెల్లడించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. హైదరాబాద్ శివారు ప్రాంతాలకు సైతం క్రమం తప్పకుండా మంచినీరు సరఫరా చేస్తున్నామని ఆయన వెల్లడించారు. 

 

 

 ఇక టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక డెబ్బై అయిదు గజాల  వరకు స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండానే ఇల్లు కట్టుకునే సౌలభ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని ఇలాంటి సదుపాయం దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేదు అంటూ ఆయన తెలిపారు. ఈసారి పురపాలక ఎన్నికల్లో  టిఆర్ఎస్ అఖండ విజయాన్ని సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ పురపాలక ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ కు ఎదురు లేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విపక్ష పార్టీల తరఫున పోటీ చేసేందుకు కనీస అభ్యర్థులు కూడా లేదని.. టిఆర్ఎస్ పార్టీ తరఫున మాత్రం ఒక్కొక్క స్థానం నుంచి ముగ్గురు నుంచి నలుగురు పోటీ పడుతున్నారని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: