20వ తేదీన జరగబోతున్న క్యాబినెట్ సమావేశం, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం భారీ పోలీసు బలగాలను దింపేసింది. సచివాలయం, అసెంబ్లీ రెండు కూడా రాజధాని గ్రామాల మధ్యలోనే ఉండటంతో చుట్టు పక్కల గ్రామాల జనాలు వచ్చి ఎక్కడ రెండింటిపైన పడతారో అన్న ముందు జాగ్రత్తతోనే ప్రభుత్వం భారీ బలగాలను దింపేసింది. రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా  సచివాలయం, అసెంబ్లీలను ముట్టడిస్తామంటూ రైతులు  ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే.

 

జగన్మోహన్ రెడ్డి చేసిన  మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత అమరావతి ప్రాంతంలో  రోజూ  ఆందోళనలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. హిడెన్ అజెండాతోనే చంద్రబాబునాయుడు రాజధాని గ్రామాల్లోని రైతులను బాగా రెచ్చ గొట్టి పెయిడ్ ఆర్టిస్టులతో పెయిడ్ ఆందోళనలు చేయిస్తున్నారంటూ వైసిపి నేతలు మండిపడుతున్నారు. సరే ఎవరి వాదన ఎలాగున్న ఓ ఐదారు గ్రామాల్లో  ఆందోళనలు జరుగుతున్నదైతే వాస్తవమే.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజధాని నిర్మాణానికి 29 గ్రామాల్లోని రైతులు భూములిస్తే ఆందోళనలు మాత్రం ఐదారు గ్రామాల్లోనే జరుగుతున్నాయి. రైతులు కూడా తమ ఆడవాళ్ళను ముందుపెట్టి వెనుక నుండి గోల చేస్తున్నారు. ఎటూ రైతులు వెనకుండే గోల చేస్తున్నారు కాబట్టి పెయిడ్ ఆర్టిస్టులు కూడా వాళ్ళలో కలిసిపోయారు.  పెయిడ్ ఆర్టిస్టుల్లో కూడా అచ్చంగా టిడిపి నేతలు, కార్యకర్తలే ఎక్కువగా ఉంటున్నారు.

 

రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ వచ్చినపుడు, వామపక్షాల నేతలు వచ్చినపుడు కూడా ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తిన విషయం తెలిసిందే. అందుకనే ముందు జాగ్రత్తగా ప్రభుత్వం   పోలీసులను దింపుంతోంది. దీన్ని రైతులు, మహిళలు వ్యతిరేకిస్తున్నారు. ఆందోళనలు జరుగుతున్నపుడు ఎలాగైనా కొందరకి గాయాలవ్వటం సహజం.  

 

దాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నేషనల్ హ్యూమన్ రైట్స్, నేషనల్ విమెన్ రైట్స్ సంస్ధలకు ఫిర్యాదులు చేసి నానా రచ్చ చేసింది. మీడియాపైన రైతుల ముసుగులో పెయిడ్ ఆర్టిస్టులు చేసిన దాడి అందరికీ తెలిసిందే. అందుకనే నిరంతరం పోలీసు బలగాలుంటున్నాయి. సరే 20వ తేదీ నుండి  కీలక పరిణామాలు జరుగుతున్నాయి కాబట్టి ముందు జాగ్రత్తగానే పోలీసులు కూడా నేతలకు నోటీసులిస్తున్నారు. గ్రామాల్లో భారీ ఎత్తున బలగాలు కూడా దిగేశాయి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: