కరోనా వైరస్ దెబ్బకు చైనా వ్యాపర రంగం కూడా పూర్తిగా కుదేలవుతోంది. కొద్ది రోజులు చైనాలోని చాలా ప్రాంతంలో ప్రజలు బయటకు రాకపోవటంతో కంపెనీ మూతపడ్డాయి. దీంతో ఆ కంపెనీలన్ని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. చాలా కంపెనీల్లో కార్మికులకు వేతనాలిచ్చేందుకు, ముడి సరుకును సరఫరా చేసేవారికి చెల్లింపులు చేసేందుకు నగదు నిల్వలు లేవని తెలుస్తోంది. వైరస్ ప్రభావంతో దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ వైరస్‌ ప్రభావం అంతకంతకు పెరుగుతుండటంతో ఆర్దిక వ్యవస్థ కూడా అదే స్థాయిలో దిగజారుతోంది.


దేశ వ్యాప్తంగా లక్షలాది చిన్న, మధ్య తరహా పరిశ్రమల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎప్పటి కప్పుడు వచ్చే లాభాలతోనే బిజినెస్‌ నెట్టుకు వచ్చే కంపెనీల భవితవ్యంప్రశార్థకంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం మొత్తం మీద 60 శాతం కంపెనీలు మరో రెండు నెలల పాటు మాత్రమే కార్యకలాపాలు కొనసాగించగలవని అంచనా వేస్తున్నారు. ఈ లోగా పరిస్థితి చక్కబడకపోతే వ్యాపర రంగం పూర్తిగా దెబ్బతింటుందంటున్నారు. కేవలం 10 శాతం సంస్థలు కాస్త ఎక్కువ కాలం పాటు ప్రస్తుత సంక్షోభాన్ని మోయగలవు.


ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న చైనా ఆర్థిక వృద్ధి తొలి త్రైమాసికంలో భారీగా పడిపోతుందని అనేక దేశాల కేంద్రీయ బ్యాంకులు హెచ్చరిస్తున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వెల్లడించింది. సెకండ్ క్వాటర్‌లో చైనా ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. అయితే, అంతర్జాతీయంగా కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెంది, దాని ప్రభావం ఎక్కువ కాలం కొనసాగితే ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వైరస వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్ని కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి. అయితే ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: