రోగగ్రస్తులకి, అనాధలకి, మరణశయ్యపై ఉన్నవారికి ఈమె పరిచర్యలు చేసారు . ఎక్కడో అల్బేనియాలో జన్మించి ఇక్కడకి వచ్చి అనేక సేవలు అందించారు మధర్ థెరిసా. ఒకరికి సాయం చెయ్యాలంటే ముఖం తిప్పుకుంటారు జనం. కన్నవాళ్ళతో, కుటుంబికులతో గొడవ పడుతూ ఉంటారు, పెద్దవాళ్ళని గౌరవించడం కూడ ఉండదు.
 
 
IHG
 
అయితే అలా రోజులు ఉంటే ఈమె మాత్రం దేశాలు దాటి ఖండాలు దాటి విభిన్న సేవలు అందించింది. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టులాడుతున్న వారిని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంది మదర్ థెరిస్సా. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీ ఆఫ్ ఛారిటీని మన దేశంలో కలకత్తాలో 1950 సంవత్సరాన్న స్థాపించింది. మానవ సేవే మాధవ సేవకి ప్రతిరూపంలా కనిపిస్తారు ఈమె.
 
IHG
 
అంత సేవకిగాను 1979లో నోబెల్ శాంతి పురస్కారం 1980 లో భారతరత్న పురస్కారం కూడ ఈమె అందుకుంది. మొత్తం 123 దేశాలలో 610 సంఘాలు వరకు కలిగి, ఎయిడ్స్/హెచ్.ఐ.వి, కుష్టు, క్షయ వంటి వ్యాధులకి గురైన వ్యాధి గ్రస్తులకి ఇళ్ళని, అనాధ శరణాలయాలని, ఆహార కేంద్రాలనీ, పాఠశాలల్ని, బాలల, కుటుంబ సలహా కేంద్రాలని తను మరణించేనాటికి ఇన్ని అందించడం చేసారు ఆమె. ఇలా ఆమె చేసిన కృషి ఎనలేనిది. ఇంత గొప్ప సేవ అందించడం ఎవరి తరం కాదు.
 
IHG
 
మదర్ థెరిస్సా ఎన్నో విమర్శలని ధైర్యంగా ఎదుర్కొని సేవని కొనసాగించారు. ఎంతో మంది వ్యక్తులచే, సంస్థలచే మధర్ ధెరిస్సా అభినందించబడ్డారు. సేవకి వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఎంతో మంది అభినందించి ప్రోత్సహించారు. 1972 పుస్తకం సమ్థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకాన్ని ముద్రించడం జరిగింది. 1997 లో ఇన్ దినేమ్ ఆఫ్ గాడ్స్ పూర్ అనే పుస్తకం ప్రచురణ జరిగింది. ఆమె పేరుతో ఒక విశ్వవిద్యాలయం అలానే మధర్ ఎక్స్ప్రెస్స్ కుడా ఈమె పేరుతో పెట్టడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: