పైన పటారం.. లోన లొటారం అన్నట్టుగా తయారైంది తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ పరిస్థితి. పార్టీలో కేసీఆర్ ఆ తర్వాత కేటీఆర్ పెత్తనం చేస్తూ..పార్టీలో నాయకులు ఎక్కడా  క్రమశిక్షణ తప్పకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నా నాయకుల మధ్య ఆధిపత్యపోరు తీవ్రస్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా, ఎక్కడా అవి సర్దుబాటు అవ్వకపోగా మరింతగా ముదిరిపోతుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడుతోందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి జిల్లాల్లోనూ పార్టీ పరిస్థితి ఉండడంతో నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారడంతో మంత్రులు, మంత్రులకు మధ్య మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య, సీనియర్లు, జూనియర్లు, ఎమ్మెల్యేలకు ఎమ్యెల్యేలకు మధ్య మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో ఉండడంతో టిఆర్ఎస్ నాయకులు కూడా వీటిని ఎలా పరిష్కరించాలో తెలియక సతమతమవుతున్నారు. 

 

విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసి సమన్వయం చేసేందుకు ప్రయత్నిస్తున్నా, పెద్దగా ఆ ప్రయత్నాలు వర్క్ ఔట్ కావడం లేదు. వరంగల్ జిల్లాలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య తీవ్ర స్థాయిలో ఆధిపత్య పోరు ఉంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం కేటీఆర్ వరకు చేరడంతో ఆయన రంగంలోకి దిగి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినా పెద్దగా ఫలితాలు రావడంలేదట. అలాగే కరీంనగర్ జిల్లాలో ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్ మధ్య ఇదే రకంగా ఆధిపత్యపోరు నడుస్తోంది. సీనియర్ నాయకుడైన ఈటెల తరచుగా గంగులతో వివాదం పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని గంగుల వర్గం ఆరోపిస్తోంది. 

IHG


అసలు ఈటెల హవా తగ్గించేందుకు గంగులకు మంత్రి పదవి ఇచ్చారని టిఆర్ఎస్ లో ప్రచారం జరుగుతోంది. వీరి మధ్య ఇప్పటికీ పోరు తీవ్ర స్థాయిలో ఉండటంతో కేసీఆర్ జోక్యం చేసుకుని మీరు సెటిల్ చేసుకోవలసిందిగా సూచించారు. ఆదిలాబాద్ జిల్లాల్లో ఇదే పరిస్థితి. ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి అన్నట్టుగా ఇక్కడ వాతావరణం ఉంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు మధ్య ఆధిపత్య పోరు బాగా ముదిరిపోయింది.


 ఒక దశలో బిజెపిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇలా ఎక్కడ చూసినా నాయకుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రతరం అవుతోంది. పార్టీ అధిష్టానం చెప్పినా, పెద్దగా ఈ వ్యవహారంలో  మార్పులు రాకపోవడంతో ఇక వీరి మధ్య సమన్వయం చేయడం తన వల్ల కాదంటూ కేటీఆర్ చేతులు ఎత్తేసినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: