కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎవరి నోట విన్నా అదే మాట. మొన్నటి వరకూ మనకేమీ కాదులే అనుకున్నాం.. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఓ వ్యక్తి కరోనాతో మరణించడం కలకలం రేపుతోంది. అతడిని తీసుకెళ్లిన ఆసుపత్రుల సిబ్బందిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందించాలని నిర్ణయించారు. కరోనా వార్తలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది.

 

 

స్టాక్ మార్కెట్లలో ఒక్క రోజే 11 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. కరోనా తో ముఖ్యంగా పౌల్ట్రీ రంగం కుదేలైంది. ఇప్పుడు కోడి కూర అంటేనే జనం పారిపోతున్నారు. చికెన్ తో కరోనా రాదని ఏకంగా మంత్రులే ప్రచారం చేస్తున్నా జనం పట్టించుకోవడం లేదు. చికెన్ తినడం లేదు. దీంతో కేజీ చికెన్ చివరకు 50 రూపాయలకు పడిపోతోంది. కరోనా వైరస్ ప్రభావంపై జరుగుతున్న ప్రచారం కారణంగా కోళ్ల పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.

 

 

కరోనా వైరస్ కు సంబంధించి గాలి వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయని మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వదంతుల వల్ల కోళ్లు, కోడిగుడ్ల వినియోగం తగ్గించారని, దానివల్ల తెలంగాణలో వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. స్వయంగా తాను కూడా ఈ కరోనా వార్తల వల్ల నష్టపోయానని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

 

 

తనకు కూడా పౌల్ట్రీ ఉందని, తన ఒక్కడికే పది కోట్ల రూపాయల నష్టం వచ్చిందని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కోడి, గుడ్డు పౌష్టికాహారమని, వాటివల్ల ఎలాంటి వైరస్ రాదని, అందువల్ల అంతా యథాప్రకారం ప్రకారం తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. పాపం.. ఈటల రాజేందర్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: