జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి అని పెట్టిన జనసేన పార్టీ సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం, మార్చి 14న, అనగా ఇదే రోజున అవతరించింది. అందువలన నేడు భారీ స్థాయిలో ఆరో ఆవిర్భావ దినోత్సవ సభను ఈ సందర్భంగా భారీ ఎత్తున నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. అయితే, ఈ సారి వేడుకలకు రాజమహేంద్రవరంను వేదికగా అలంకరించనున్నారు... ఇప్పటికే జనసేన పార్టీ శ్రేణులు ఆయా పనులలో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. 

 

ఈ మేరకు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పి.హరిప్రసాద్ పిలుపునిచ్చిన సంగతి తెలిసినదే. ఇందులో భాగంగా.. ఆ రోజు ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్యనాయకులతో సమావేశం అవుతారు. దాని అనంతరం.. సాయంత్రం 4 గంటలకు ధవళేశ్వరంలోని రామపాదాల రేవులో పవన్ కళ్యాణ్ గోదావరి నదికి హారతి సమర్పించి... ‘మన నుడి - మన నది’ అనే పుణ్య కార్యక్రమానికి శ్రీకారం చుడతారని భోగట్టా. కనుక యావన్మంది... జనులు అందరూ వచ్చి, ఈ విశేష కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని, పార్టీ వ్యవహారాల కార్యదర్శి పి.హరిప్రసాద్ పిలుపునిచ్చారు.

 

హైదరాబాద్‌లోని ఓ బడా హోటల్‌లో 2014 మార్చి 14న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని లాంచ్ చేశారు . అక్కడినుండి వివిధ రకాల సమస్యపైన ప్రశ్నలను లేవనెత్తి, ఎన్నటికో పరిష్కర మార్గాలను సుగమం చేసారు. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - టీడీపీతో కలసి జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి విజయ దుందుభి మోగించింది. ఇక్కడ కొసమెరుపు ఏమంటే ఆ టైములో  టీడీపీ, బీజేపీ మాత్రమే పోటీ చేశాయి. జనసేన మాత్రం పోటీ చేయలేదు.

 

ఇక తదుపరి కాలంలో కొన్ని పరిణామాల మధ్యన తెలుగుదేశం పార్టీతో పొత్తు నుంచి బయట పడి, పవన్ కళ్యాణ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, బీఎస్పీతో కలసి కంబైన్డ్ గా పోటీలోకి దిగారు. ఈ ఎన్నికలలో  పవన్ కళ్యాణ్, తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు చోట్లా ఓడిపోయిన సంగతి తెలిసినదే. జనసేన పార్టీకి సంబంధించి, ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. ఇటీవల జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ బి.జె.పికి దగ్గరయ్యిన విషయం విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: