ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్ భయం  కనిపిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి  వరకు కేవలం ఒక్క చైనా దేశాలకు మాత్రమే పరిమితమైన  మహమ్మారి వైరస్.. క్రమంగా  ప్రస్తుతం ప్రపంచ దేశాలకు శరవేగంగా పాకీపోతుంది. దీంతో ప్రపంచం మొత్తం చిగురుటాకుల కరోనా  వైరస్ భయంతో వణికిపోతుంది. ఇక కొన్ని దేశాల్లో అయితే రోజురోజుకు పరిస్థితి చేయి దాటి పోతుంది. ఇటలి, ఇరాన్ లాంటి దేశాలలో కరోనా వైరస్  మరణ మృదంగం మోగిస్తూ ఎంతో మందిని పొట్టనబెట్టుకుని...  ఇంకా ఎంతోమంది మృత్యువుతో పోరాడేలా  చేస్తోంది . ఇక మిగతా దేశాల్లో కూడా ఈ వైరస్ ప్రభావం ప్రజలందరిలో ప్రాణం  భయం పాతుకు పోయేలా చేస్తుంది. 

 

 

 అయితే తుమ్మడం లేదా దగ్గడం, జ్వరం రావడం ఇలాంటి లక్షణాలు కరోనా  వైరస్ లక్షణాలు అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరైనా దగ్గినట్లు  కనిపించిన తుమ్మినట్లు  కనిపించినా అది కరోనా  వైరస్ ప్రభావమే అని అనుకుంటున్నారు చాలామంది.అయితే సాధారణంగా తుమ్ములు వచ్చిన చాలామంది తుమ్మడం  ఎందుకు భయపడుతున్నారు. ఒకవేళ వాళ్ళు తుమ్మితే  చుట్టుపక్కల వాళ్ళు వారికి కరోనా వైరస్ సోకింది అని అనుకుంటారేమో భయపడి చస్తున్నారు. తుమ్ము వస్తే బలవంతంగా ఆపేసుకుంటున్నారు. అయితే ఇలా చేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు  వైద్యులు. తుమ్ము  ఆపుకోవడం ద్వారా ఆ సమయంలో కాస్త హాయిగా అనిపించినప్పటికీ... తుమ్ము వచ్చినప్పుడు మాత్రం ఆపకూడదు అంటున్నారు వైద్యులు. 

 

 

 ఒకవేళ తుమ్ము వచ్చినప్పుడు మోచేతిని అడ్డంపెట్టుకుని అయినా లేదా కర్చీఫ్  అడ్డంపెట్టుకుని తుమ్మాలి  తప్ప... తుమ్ము  ఆపకుంటే మాత్రం కరోనా  వైరస్ వల్ల ప్రాణం పోవడం ఏమో కానీ... ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చి ప్రాణం పోతుంది అంటున్నారు వైద్యులు. ప్రస్తుతం కరోనా  వ్యాప్తి నేపథ్యంలో కాస్త జాగ్రత్తగా జనాన్ని దృష్టిలో పెట్టుకుని తుమ్మలని ... తుమ్ము వస్తే బలవంతంగా ఆపుకోవడం చేస్తే చెవిలోని డయాఫ్రమ్  దెబ్బతింటుంది అని చెబుతున్నారు. దీని ద్వారా ఏకంగా చెవుడు వచ్చే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. అంతేకాకుండా కంట్లోని తెల్లటి ఐరిస్ చుట్టూ ఉన్న రక్తనాళాలు దెబ్బతింటాయి అంటూ  సూచిస్తున్నారు. ఇక బ్రెయిన్ లోని రక్త నాళాలు కూడా బలహీనంగా మారి పోతాయట. అయితే తన శరీరంలో ఏదైనా అవసరం లేనిది బాడీ లోకి వచ్చినప్పుడు మాత్రమే తుమ్ము వస్తుందని.. ఒకవేళ తుమ్మ కుండా ఉంటే ఆ వైరస్ ముక్కులోని ఉండిపోయే ప్రమాదం కూడా ఉంది అని చెబుతున్నారు వైద్యులు. తుమ్ము ఆపడం ద్వారా ఒక్కసారి గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: