కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో ఇంటి నుంచి బయటకి వెళ్లవద్దని కీలక ఆదేశాలు జారీ చేసాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. కొన్ని  రాష్ట్రాలు మినహా అన్ని ప్రభుత్వాలు ఈ నెల 31  వ తేదీ వరకు లాక్ డౌన్ డిసైడ్ చేసాయి.  మొన్న ఆదివారం భారత దేశ వ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ పాటించిన విషయం తెలిసిందే.  ఆ తర్వాత దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  అయితే జనతా కర్ఫ్యూ పాటించిన జనాలు ఐదు గంటల తర్వాత డాక్టర్లు చేస్తున్న సేవకు సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే. కరోనా రోగులు ఉండే ఐసోలేషన్ వార్డులో విధులు నిర్వర్తించమన్నారంటూ జార్ఖండ్‌లో డాక్టరు దంపతులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.

 

ఆ విధుల్లో ఇతర వైద్యులను నియమించకుండా తమనే ఎందుకు నియమించాలని వారు ప్రశ్నించారు. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని జంషడ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం రేపుతోంది. కాగా, కరోనా రోగుల వార్డులో డ్యూటీ వేశారనే భయంతో డాక్టర్ టిర్కీ, తన భార్య అయిన డాక్టర్ సౌమ్యతో కలిసి తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు వాట్సాప్ సందేశంతోపాటు ఈ మెయిల్ ద్వారా రాజీనామా లేఖను సెండ్ చేసారు. అయితే, ఈ విషయాన్ని ఝార్ఖండ్ వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు సివిల్ సర్జన్... ఆ డాక్టరు దంపతులిద్దరూ 24గంటల్లోగా విధుల్లో చేరాలని లేకుంటే ఝార్ఖండ్ ఎపిడమిక్ డిసీజెస్ రెగ్యులేషన్ 2020, ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 ప్రకారం వారిపై కేసు నమోదు చేస్తామని ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ నితిన్ మదన్ హెచ్చరించారు.  

 

దాంతో దిగి వచ్చిన డాక్టర్ తమ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు...తన భార్య డాక్టర్ సౌమ్యకు ఆరోగ్య సమస్యలున్నాయని, తన సోదరికి కిడ్నీ మార్పిడి జరిగిందని, వారిద్దరికీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నందున తాము ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నామని..  కరోనా రోగులకు చికిత్స చేయకుండా పారిపోయే రకం కాదన్నారు. మళ్ళీ విధుల్లో చేరతామని, కరోనా సంక్షోభం ముగిశాక ఉద్యోగాన్ని పూర్తిగా వదిలేయనున్నట్టు డాక్టర్ టిర్కీ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: