భారత్ లో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా కరోనా భారీన పడి మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 20కు చేరింది. కేరళలో తొలి కరోనా మరణం నమోదైంది. రాష్ట్రంలోని కొచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతి చెందాడు. దేశంలో ఇప్పటివరకూ 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలలో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 
 
ఇప్పటివరకూ కేరళలో 165 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్ లో తొలి కరోనా కేసు కూడా కేరళలోనే వెలుగు చూడటం గమనార్హం. ఆ తరువాత కేరళ కరోనాను కట్టడి చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించి కొత్త కేసులు నమోదు కాలేదు. కానీ గత రెండు వారాల నుంచి కేరళలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటివరకూ కరోనా సోకిన వారిలో 70 మంది కోలుకున్నట్టు ప్రకటన చేసింది. 
 
రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో ఇప్పటివరకూ 27 రాష్ట్రాలకు/ కేంద్రాపాలిత ప్రాంతాలకు కరోనా వైరస్ విస్తరించింది. తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 59కు చేరింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని చెప్పవచ్చు. 
 
ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య ఆరు లక్షలకు చేరగా దాదాపు 27 వేల మంది ఈ వ్యాధి భారీన పడి మృతి చెందారు. ప్రస్తుతం ఈ వైరస్ అమెరికా, ఇటలీ, స్పెయిన్, భారత్ ను వణికిస్తోంది. ఇటలీలో కరోనా భారిన పడి నిన్న ఒక్కరోజే 969 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ అక్కడ 9,134 మంది మృత్యువాత పడ్డారు. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 1,00,000కు చేరగా 1500 మంది మృతి చెందారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: